ఎన్టీఆర్ తో మోహన్ లాల్?

శ్రీమంతుడు సినిమాలో జగపతిబాబు కీలకం..మిర్చి సినిమాలో సత్యరాజ్ వైనం తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కోసం కూడా కొరటాల శివ అలాంటి క్యారెక్టర్ ఒకదాన్ని తయారుచేస్తున్నాడట. ఎన్టీఆర్ తో మైత్రీ మూవీస్ నిర్మించే…

శ్రీమంతుడు సినిమాలో జగపతిబాబు కీలకం..మిర్చి సినిమాలో సత్యరాజ్ వైనం తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కోసం కూడా కొరటాల శివ అలాంటి క్యారెక్టర్ ఒకదాన్ని తయారుచేస్తున్నాడట. ఎన్టీఆర్ తో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా కోసం ఇదంతా. 

అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరికి ఇస్తారు? ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరూ ఈ క్యారెక్టర్ కు మోహన్ లాల్ అయితే సూపర్ గా వుంటుందని అనుకుంటున్నారట. త్వరలో శివ కేరళ వెళ్లి మోహన్ లాల్ కు లైన్ చెబుతారు. ఆయన ఓకె అంటే మంచి కాంబినేషన్ సెట్ అయినట్లే. 

ఇటీవలే మోహన్ లాల్ ఓ తెలుగు సినిమాకు ఓకె చెప్పారు. దాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇప్పుడు కొరటాల శివ సినిమా కూడా ఓకె అంటే రెండో సినిమా అవుతుంది. చాలాకాలం కిందట ఓ కామియో క్యారెక్టర్ లో మోహన్ లాల్ తెలుగు సినిమాలో తళుక్కు మన్నారు.ఇదిలా వుండగా ఈ క్యారెక్టర్ కు హరికృష్ణను తీసుకుంటారని ఓ వార్త పుట్టించారు. అది ముమ్మాటికీ అబద్దమని యూనిట్ వర్గాల బోగట్టా.