Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ను కలిపేందుకు ఆ నిర్మాత?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ను కలిపేందుకు ఆ నిర్మాత?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అన్నది జూనియర్ అభిమానులకు చాలా ఆసక్తికరమైన సంగతి. ఈ కాంబినేషన్ ను ఎలాగైనా సెట్ చేయాలని ఓ నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్మాత ఎవరో కాదు, ఎన్టీఆర్ కు నాన్నకు ప్రేమతో లాంటి మంచి హిట్ ఇచ్చిన బోగవిల్లి ప్రసాద్. ఆయనకు ఇటు ఎన్టీఆర్ తోనో, అటు త్రివిక్రమ్ తోనూ మంచి సంబంధాలు వున్నాయి. 

గతంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ హారిక హాసినిలో సెట్ అయ్యేదే, కానీ లాస్ట్ మినిట్ లో ఆగిపోయింది. ఇది అ..ఆ ముందు సంగతి. త్రివిక్రమ్ కన్నా హారిక హాసిని నిర్మాతకు ఎన్టీఆర్ వ్యవహార శైలి పెద్దగా నచ్చలేదని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆ తరువాత మళ్లీ ఈ కాంబినేషన్ కోసం ఎవరు ట్రయ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ తో సినిమా చేయాలని బోగవిల్లి ప్రసాద్ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. 

త్రివిక్రమ్ కు బోగవిల్లి ప్రసాద్ కు ఆ మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చినా, ఇద్దరి మధ్య మంచి బాండింగ్ నే వుంది. అలాగే ఎన్టీఆర్ కు మళ్లీ బోగవిల్లి ప్రసాద్ కు సినిమా చేయాలని వుంది. అందుకే ఈ కాంబినేషన్ సెట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇది ఇప్పుడే సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే పవన్ సినిమా తరువాత త్రివిక్రమ్ కు మైత్రీ మూవీస్ - మహేష్ కాంబినేషన్ లో సినిమా ఆబ్లిగేషన్ వుంది. దాని తరువాతే ఇది సాధ్యం కావచ్చు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?