ఎన్టీఆర్ హిట్టు కోసమే కాదు… ఇప్పుడు టైటిల్ కోసం కూడా అన్వేషిస్తున్నాడు. ఔను.. ఇప్పుడు యంగ్ టైగర్‌కి అర్జెంటుగా ఓ మాస్ టైటిల్ కావాలి. ఓ షరతు కూడా ఉంది. రెండక్షరాల పేరు కావాలి. ఎన్టీఆర్ – సంతోష్ శ్రీనివాస్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. సమంత, ప్రణీత కథానాయికలు.
ఈ చిత్రానికి ముందు రభస అనే టైటిల్ అనుకొన్నారు. కానీ ఈ టైటిల్ పెట్టడం ఎన్టీఆర్ కి సుతారమూ ఇష్టం లేదట. ఆ తరవాత ఎలా వచ్చిందో తెలీదుగానీ ఈసినిమాకి జోరు అనే పేరు ప్రచారంలోకి వచ్చేసింది. మా సినిమా టైటిల్ ఇది కాదు… అని చిత్రబృందం స్పష్టం చేయడంతో జోరుకి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు మరో టైటిల్ అన్వేషణలో పడిపోయారు.
ఎన్టీఆర్ – బెల్లంకొండ కలయికలో వచ్చిన ఆది సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆది ఎప్పుడు రిలీజ్ అయ్యిందో ఈ కొత్త సినిమానీ అదే తేదీన విడుదల చేస్తారు. ఆ సెంటిమెంట్ టైటిల్లోనూ వర్కవుట్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాకీ రెండక్షరాల పేరే వెదుతున్నారట. మరి చివరికి ఏం పెడతారో చూడాలి.