బాల నాగార్జున నాగచైతన్య కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం ఈమధ్యే సెట్స్ పైకి వెళ్లింది. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో ఆకట్టుకొన్న కొండా విజయ్‌కుమార్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. తన సొంత సంస్థలో పనిచేయడం చైతూకి ఇదే తొలిసారి.
ఈ చిత్రానికి ఒక లైలా కోసం అనే టైటిల్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. తాతయ్య పాపులర్ పాట కాబట్టి సెంటిమెంట్‌గా ఈ టైటిల్ వర్కవుట్ అవుతుందని అభిమానులూ భావించారు. అయితే ఈసినిమాకి టైటిల్ ఇది కాదట. అసలు ఈ టైటిల్ ప్రస్తావనే ఇంత వరకూ రాలేదని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తారట.