పూరి కూడా తూచ్ చెప్పాడు

మ‌హేష్ బాబు '1'కి అంద‌రూ భ‌య‌ప‌డుతున్నారు. సంక్రాంతికి వ‌స్తున్నామ‌ని చెప్పి – ఆన‌క తూచ్ చెబుతున్నారు. మ‌హేష్ సినిమా '1' ఈ సంక్రాంతికి రాబోతోంది. జ‌న‌వరి 10న విడుద‌ల తేదీ ఫిక్స్ చేశారు. దాంతో…

మ‌హేష్ బాబు '1'కి అంద‌రూ భ‌య‌ప‌డుతున్నారు. సంక్రాంతికి వ‌స్తున్నామ‌ని చెప్పి – ఆన‌క తూచ్ చెబుతున్నారు. మ‌హేష్ సినిమా '1' ఈ సంక్రాంతికి రాబోతోంది. జ‌న‌వరి 10న విడుద‌ల తేదీ ఫిక్స్ చేశారు. దాంతో పాటు కొన్ని సినిమాలు బెర్తులు ఖాయం చేసుకొన్నాయి. కానీ అందులోంచి ఒకొక్కటీ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. మొన్నే రేసు గుర్రం సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకొంది. ఇప్పుడు ఆ జాబితాలో హార్ట్ ఎటాక్ కూడా చేరిన‌ట్టు స‌మాచార‌మ్‌. 

పూరి – నితిన్ ల క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం హార్ట్ ఎటాక్‌. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌ని ముందు నుంచీ చెబుతున్నారు. కానీ… ఈ ఆలోచ‌న నుంచి డ్రాప్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌హేష్ సినిమా 1 దాదాపు 1200 థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. '1'కి అటూ ఇటుగా ఎవ‌డు కూడా వ‌చ్చేస్తుంది. 

దాదాపు థియేట‌ర్లన్నీ ఈ రెండు సినిమాలూ కైవ‌సం చేసుకొంటాయి. మిగిలిన సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌కడం క‌ష్టమైపోతుంది. అందుకే పూరి త‌న సినిమా విడుద‌ల తేదీ వాయిదా వేసుకొన్నట్టు తెలిసింది. స‌రికొత్త తేదీ త్వర‌లో ప్రక‌టించే అవ‌కాశం ఉంది.