ఓ అగ్ర నిర్మాత వన్ డే గాయబ్?

సినిమా రంగంలో ఫైనాన్షియర్ల దందా ఓ లెక్కలో వుంటుంది. కోట్ల రూపాయిలు చాలా తక్కువ గ్యారంటీకి ఇవ్వడం అన్నది కామన్. ప్రాజెక్టుపై నమ్మకంతో, నిర్మాతతో పరిచయంతో ఇస్తారు. కానీ తేడా వస్తే వసూళ్ల  పట్ల…

సినిమా రంగంలో ఫైనాన్షియర్ల దందా ఓ లెక్కలో వుంటుంది. కోట్ల రూపాయిలు చాలా తక్కువ గ్యారంటీకి ఇవ్వడం అన్నది కామన్. ప్రాజెక్టుపై నమ్మకంతో, నిర్మాతతో పరిచయంతో ఇస్తారు. కానీ తేడా వస్తే వసూళ్ల  పట్ల కూడా అంతే కఠినంగా వుంటారు. ఇటీవల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ పెద్ద నిర్మాత ఇలాగే ఫైనాన్షియర్ల దందాను చవిచూసినట్లు తెలిసింది. 

ముంబాయి నుంచి వచ్చిన ఓ ఫైనాన్షియర్ మనుషుల్ని ఆ నిర్మాత తన స్టయిల్ లో తీసి పారేయబోగా, వాళ్లు అంతకన్నా ముదర్లు కనుక, బలవంతంగా తమ అడ్డాకు తీసుకుపోయి ఒక రోజంతా వారితో వుంచుకున్నట్లు తెలిసింది. వారికి రావాల్సిన యాభై కోట్లకు గాను, నిర్మాతకు వున్న కొన్ని ఎకరాల భూమిని సెటిల్మెంట్ చేసకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాతే వారు అతగాడిని వదిలారని టాక్. 

సదరు నిర్మాతకు ఇంకా మరో ముఫై, నలభై కోట్ల వరకు బకాయిలు వున్నాయని, అయితే వాటిలో టాలీవుడ్ పెద్ద ఫైనాన్షియర్లవి అని వినికిడి. ముంబాయ్ వాలాలు ఇలా చేస్తే మరి వసూళ్లకు మన లోకల్ ఫైనాన్షియర్లు ఏం చేస్తారో అని కృష్ణానగర్ లో డిస్కషన్ నడుస్తోంది.