అక్టోబర్ 1 డైనమైట్

మొత్తానికి మంచు విష్ణు ఫిక్సయ్యాడు. దేవా కట్టా దర్శకత్వంలో తాను రీమేక్ చేసిన డైనమైట్ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నాడు. దసరా అయితే రెండు మూడు సినిమాలైనా కలెక్షన్లు వుంటాయి. Advertisement పైగా…

మొత్తానికి మంచు విష్ణు ఫిక్సయ్యాడు. దేవా కట్టా దర్శకత్వంలో తాను రీమేక్ చేసిన డైనమైట్ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నాడు. దసరా అయితే రెండు మూడు సినిమాలైనా కలెక్షన్లు వుంటాయి.

పైగా అక్టోబర్ 2 సెలవు. మూడు రోజులు..ప్లస్ మరో మూడు రోజులు కలెక్షన్లు వుంటే చాలు, చిన్న సినిమా కాబట్టి. పైగా హీరో రెమ్యూనిరేషన్ పక్కన పెట్టేస్తే, శాటిలైట్ తోనే సరిపెట్టేసుకోవచ్చు. ఇన్నాళ్లు ఇదిగో అదిగో అంటూ వచ్చి, ఆఖరికి ఇప్పుడు దసరా సీజన్ కు ఫిక్సయ్యారు.

నిజానికి ఈ సీజన్ ఏమంత ఖాళీగా లేదు. అక్టోబర్ 2న వరుణ్ తేజ కంచె విడుదలకు ఫిక్సయింది. అదే టైమ్ లో రామ్ శివమ్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. తరువాతి వారం రామ్ చరణ్, ఆ పైవారం అఖిల్ సినిమాలు వున్నాయి.