మణిశర్మ అంటే తెలుగులో మణిపూసల్లాంటి పాటలు అందించిన వైనం గుర్తుకు వస్తుంది. కానీ అదంతా గతం. ఇప్పుడు మణిశర్మ కేవలం ఆర్ ఆర్ లకే పనికివస్తున్నాడు. మంచి సినిమా అంటే మణిశర్మను పిలిచి ఆర్ ఆర్ చేయిస్తున్నారు. ఆ మధ్య టెంపర్ కు అలాగే చేసాడు.
యంగ్ మ్యూజిక్ డైరక్టర్లలో దేవీ అంతగా ఆర్ ఆర్ చేసేవాళ్లు లేరు. కానీ పాటల కోసం ఈ యంగ్ మ్యూజిక్ డైరక్టర్లు కావాలి. అందుకే అనూప్ లాంటి వాళ్లను పాటలకు పెట్టుకుని, ఆర్ ఆర్ బాధ్యత మణికి అప్పగిస్తున్నారు. ఎలాగైతే డబ్బులు వస్తున్నపుడు. అందుకే మణి కూడా కాదనడం లేదు.
ఇంతకీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, వివి వినాయక్-అఖిల్ సినిమాకు మణిశర్మ ఆర్ ఆర్ అందిస్తున్నాడన్నది. ఈ సినిమాకు అనూప్, థమన్ ఇద్దరు సంగీత దర్ళకులు. వీళ్లకు తోడయ్యాడు మణిశర్మ. ముచ్చటగా మ్యూజిక్ డైరక్టర్ అన్నమాట.