శ్రీమంతుడు తొలివారం 60 కోట్లు?

శ్రీమంతుడు సినిమా రేపటితో (గురువారం) వన్ వీక్ పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం నిత్యం మూడు కోట్లకు దగ్గరగా కలెక్షన్లు వస్తున్నాయి. మంగళవారం నాటికి 53 కోట్లకు దగ్గరగా వచ్చాయి. బుధ, గురువారాలు మరో ఏడు…

శ్రీమంతుడు సినిమా రేపటితో (గురువారం) వన్ వీక్ పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం నిత్యం మూడు కోట్లకు దగ్గరగా కలెక్షన్లు వస్తున్నాయి. మంగళవారం నాటికి 53 కోట్లకు దగ్గరగా వచ్చాయి. బుధ, గురువారాలు మరో ఏడు కోట్లు వసూలు చేయగలిగితే ఫస్ట్ వీక్ లో 60 కోట్లు వసూలు చేసిన (బాహుబలిని మినహాయిస్తే) సినిమాగా రికార్డు సృష్టించినట్లే.

ఇంత వరకు అసలు టోటల్ రన్ లోనే 60 కోట్లు దాటిన సినిమాలు ఒకటి రెండే. అలాంటిది కేవలం వన్ వీక్ లోనే 60 కోట్లంటే రికార్డే. ఇదిలా వుంటే ఈ కలెక్షన్లతో శ్రీమంతుడు టీమ్ సంతృప్తి పడడం లేదు. 80 కోట్లకు రీచ్ కావాలన్నది యూనిట్ ఆలోచన. అందుకే ప్రెస్ మీట్ లు, కొత్త ట్రయిలర్లు, రాజకీయ నాయకుల బైట్ లు, ఇలా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. ఆగస్టు 15, ఆధివారం పక్క పక్కన వచ్చాయి. ఈ రెండు రోజులు పది కోట్లు వసూలు చేస్తుందా అన్నది ఆలోచన.

అదే కనుక జరిగితే టూ వీక్స్ లో 80 కోట్లు పెద్ద సమస్య కాకపోవచ్చు. ప్రస్తుతానికి సింగిల్ థియేటర్లు స్టడీగానే వున్నాయి. మల్టీ ఫ్లెక్స్ లు ఒక్కో ఏరియాలో ఒక్కోలా వున్నాయి. 21న కిక్ 2 వచ్చేవరకు ఏ మాత్రం పుష్ చేయగలిగినా, శాటిలైట్ ఇతరత్రా వ్యవహారాలు కలుపుకుని, వంద కోట్ల సినిమాగా మారతుంది శ్రీమంతుడు.