త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత వీరరాఘవ చకచకా రెడీ అయిపోతోంది. తప్పనిసరి అయితే తప్ప గ్యాప్ తీసుకోవడంలేదు. అక్టోబర్ 10 లేదా 11న విడుదల డేట్ గా డిస్కస్ చేస్తున్నారు. ఈ రెండూ కూడా శుక్రవారం కాదు. ఒకటి బుధవారం, మరోటి గురువారం. ఎందుకంటే ఈ బుధవారం నాడే దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దసరా సెలవులు మొదలవుతాయి. అందుకే ఈ రెండు డేట్లను పరిశీలిస్తున్నారు. అందుకే ఎక్కడా ఆలస్యం కాకూడదని, ఎన్టీఆర్ కూడా అస్సలు గ్యాప్ తీసుకోవడంలేదు. కొడుకు పేరు పెట్టడానికి ఒక్కరోజు మాత్రం గ్యాప్ తీసుకున్నాడు.
ఆగస్టు 15న టీజర్
ఇప్పటికే అరవింద సమేత వీరరాఘవ టైటిల్ తో పాటు ఎన్టీఆర్ సిక్స్ ఫ్యాక్ ఫస్ట్ లుక్ ను వదిలారు. ఆగస్టు 15న టీజర్ ను వదిలే ఆలోచన చేస్తున్నారు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే అన్నది సందర్భంగా వుంటుందని ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ సెకెండ్ వీక్ లో అడియో ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాకు ఈ మధ్య ఏ సినిమాకు దక్కని డేట్ దొరికింది.
మహానటి తరువాత నుంచి జనాలను కిర్రెక్కించేంత సినిమా ఇప్పటిదాకా రాలేదు. దసరాలోపు అలాంటి సినిమా వస్తుందని అంచనాలు కూడా లేవు. రంగస్థలం సినిమా విడుదలకు ముందు దాదాపు కొన్నినెలల పాటు ఏ విధంగా అయితే సరైన సినిమా లేక గ్యాప్ వచ్చిందో, అరవింద సమేతకు కూడా అలాగే గ్యాప్ వచ్చింది. అందుకే బయ్యర్లు తెగించి మరీ అంతటి రేట్లకు కొంటున్నట్లు కనిపిస్తోంది.