కొత్త లుక్ తో కళ్యాణ్ రామ్

డిఫరెంట్ సినిమాలు చేయడం అన్నది హీరో కళ్యాణ్ రామ్ మొదటి నుంచీ అలవాటు చేసుకున్న పద్దతి. సినిమాలు హిట్ అయినా, కాకపోయినా, ఏ సినిమా కూడా కళ్యాణ్ రామ్ కు బ్యాడ్ నేమ్ మాత్రం…

డిఫరెంట్ సినిమాలు చేయడం అన్నది హీరో కళ్యాణ్ రామ్ మొదటి నుంచీ అలవాటు చేసుకున్న పద్దతి. సినిమాలు హిట్ అయినా, కాకపోయినా, ఏ సినిమా కూడా కళ్యాణ్ రామ్ కు బ్యాడ్ నేమ్ మాత్రం తీసుకురాలేదు. అయితే ఇటీవల విడుదలైన నా నువ్వే కూడా బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు కానీ, పెద్ద డిస్సపాయింట్ మెంట్ గా మిగిలిపోయింది. అన్ని విధాలా కొత్తగా ట్రయ్ చేస్తున్నందుకు ప్రేక్షకుల నుంచి కనీసం కొంతయినా పాజిటివ్ రెస్పాన్స్ వుంటుందని అనుకుంటే, పూర్తిగా రివర్స్ అయింది వ్యవహారం. 

దాని నుంచి తేరుకుని మళ్లీ మరో సినిమా చాలావరకు ఫినిష్ చేసాడు కళ్యాణ్ రామ్. ఇంకా పేరుపెట్టని ఆ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా వదిలారు. కేవలం హీరో ఫస్ట్ లుక్ మాదిరిగా కాకుండా, దాని బ్యాక్ గ్రౌండ్ లో సినిమా జోనర్ ను కూడా చెప్పే ప్రయత్నం చేసారు. వివిధ రకాల చిన్న చిన్న ఫొటోలు, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇతర సింబల్స్ అన్నీ పిక్ లో జోడించారు.

సినిమాటోగ్రాఫర్ గుహన్ తొలిసారి దర్శకుడిగా మారి చేస్తున్న ప్రయత్నం ఇది. దీన్ని కూడా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ కళ్యాణ్ రామ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని ఆశిద్దాం.