2018 సమ్మర్.. సాహోనా? సైరా నా?

పెద్ద సినిమాలు క్లాప్ కొట్టిన వెంటనే డేట్లు ప్రకటించేయడం అన్నది ఈ మధ్య ఎక్కువయింది. సంక్రాంతికి వస్తున్నామని బోయపాటి-రామ్ చరణ్  సినిమా సంక్రాంతి 2018కి వస్తోంది అంటూ దాదాపు తొమ్మిది నెలల క్రిందటే ప్రకటన…

పెద్ద సినిమాలు క్లాప్ కొట్టిన వెంటనే డేట్లు ప్రకటించేయడం అన్నది ఈ మధ్య ఎక్కువయింది. సంక్రాంతికి వస్తున్నామని బోయపాటి-రామ్ చరణ్  సినిమా సంక్రాంతి 2018కి వస్తోంది అంటూ దాదాపు తొమ్మిది నెలల క్రిందటే ప్రకటన వచ్చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ 25వ సినిమా డేట్ కూడా అర్జెంట్ గా ప్రకటించేసారు. ఇంకా ఏడెనిమిది నెలల టైమ్ వుండగానే డేట్ ప్రకటించేసారు.

ఇక 2019 సమ్మర్ లోపు వస్తాయని అనుకునే సినిమాలు రెండే మిగిలాయి. ఒకటి ప్రభాస్ సాహో, రెండవది మెగాస్టార్ సైరా. ఈ రెండింటిలో ముందుగా వచ్చే అవకాశం ఒక్క సైరాకే వుంది. ఎందుకంటే సైరా షూట్ చకచకా జరగిపోవడం ఒకటి. కంపారిటివ్ గా సాహో అంతా భారీ టెక్నికల్ వర్క్ అవసరమైన సినిమా కాదు. అందువల్ల 2019 సమ్మర్ ను సైరా బుక్ చేసుకునేటట్లు కనిపిస్తోంది.

వాస్తవానికి ఇప్పటి వరకు 2019 సమ్మర్ కు సాహో వస్తుందని వినిపిస్తోంది. కానీ ఇప్పుడు సీన్ చూస్తుంటే ఆ అవకాశం కనిపించడంలేదు. సైరా సినిమా కు సమ్మర్ లోపు మరో డేట్ లేదు. సమ్మర్ ను సైరా బుక్ చేసుకుంటే, సాహోకు స్కోప్ వుండదు.

పైగా సాహో అంత సులువుగా రెడీ కాదని, సినిమా టాకీ పార్ట్ పూర్తయినా కూడా, టెక్నికల్ వర్క్ చాలా వుంటుందని, అది చాలా టైమ్ తీసుకుంటుందని టాలీవుడ్ లో వినిపిస్తోంది. కానీ సాహోలాంటి భారీ సినిమాలకు సమ్మర్ కన్నా మంచి సీజన్ మరోటి వుండదు.

ఇలాంటి పోటీ వస్తుందని ముందుగా లెక్కలు కట్టే, మహేష్ సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తెలివిగా, డేట్ ను అర్జెంట్ గా ప్రకటించేసారు. ఇక ఉగాది అయిపోయింది. మీరు మీరు సమ్మర్ సంగతి చూసుకోండి అంటూ తెలివిగా బాల్ ను సైరాకు, సాహోకు మధ్యన వదిలారు. మరి ఎవరు గోల్ చేస్తారో చూడాలి.