అసలే రెండు టీజర్లు విడుదల చేస్తే రెండూ తుస్సుమన్నాయి. పోనీ బిజినెస్ ఏమన్నా అయిందా అంటే, ఆ దాఖలా కూడా లేదు. ఇక ఏం చేయాలి? అందుకే రావాలా? వెనక్కు వెళ్లాలా? అని ముందు వెనుక ఊగిసలాడుతోంది.
అసలే బిజినెస్ జరగలేదు. ఏకమొత్తంగా తెలుగురాష్ట్రాలకు ఆఫీసర్ ను తీసుకునేవాళ్లు కనిపించడం లేదు. అందుకే ఏరియాల వారీ అమ్మాలని ప్రయత్నాలు స్టార్ట్ చేసారు. ఇలా చేయాలి అంటే కాస్త టైమ్ పడుతుంది.
అందుకే ఆర్జీవీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. ముందుగా కాస్త హడావుడి చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ తదితర విషయాలపై ఆయన మీడియాతో తన భావాలు పంచుకుంటారు. ఆ తరువాత ఆఫీసర్ వ్యవహారాలు చూస్తారు.
ఆఫీసర్ పై పోటీకి నేలటికెట్ రెడీగా వుంది. మాస్ హీరో రవితేజ, హిట్ డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్. ఇలాంటి టైమ్ లో ఆపీసర్ ను వేయాలా? వద్దా? అని ఊగిసలాడుతున్నారు. జూన్ 1కి వేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ విషయం ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది.