నాని-గౌతమ్ తిన్ననూరి కాంబో జెర్సీ మీద చిత్రమైన గ్యాసిప్ లు ప్రారంభమయ్యాయి. సినిమాకు రెండు క్లయిమాక్స్ లు చిత్రీకరించారని, వాటిలో ఒకటి త్రివిక్రమ్ ఓకె చేయాల్సి వుంటుందని వాటి సారాశం. ఇవి విని యూనిట్ లైట్ తీసుకుని, నవ్వుకుంటోంది.
సినిమా స్క్రిప్ట్ ను ముందే పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసి, ప్రిపేర్ చేసారు. దానిని మార్చడానికి కూడా వీలులేదు. ఎందుకంటే అలా మార్చే వీలువుండే స్క్రిప్ట్ కాదు అది. పైగా ట్రాజెటిక్ ఎండ్ కాదు సినిమా. సినిమా స్క్రిప్ట్ అల్లికే వేరు. అందువల్ల ట్రాజెటిక్ ఎండింగ్ అనేది ఎక్కడా అనిపించదు. కనిపించదు.
ఇదీ యూనిట్ ద్వారా తెలుస్తున్న సంగతి. అయితే రామన్ లాంబా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నారన్నది కూడా కరెక్ట్ కాదని యూనిట్ అంటోంది కానీ, ఆ ఛాయలు వున్నాయని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
ఐదేళ్లలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్, పదేళ్లుగా ప్రభుత్వాల మోసాలే!