Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఒకే వేదిక మీదకు చిరు-బాలయ్య

ఒకే వేదిక మీదకు చిరు-బాలయ్య

సీనియర్ టాప్ హీరోలు బాలయ్య-చిరంజీవి ఒకే వేదిక మీదకు వచ్చి, నందమూరి, మెగాభిమానులను అలరించబోతున్నారు. బాలయ్య బాబు తన సన్నిహితుడు సాయి కొర్రపాటి కోసం వస్తున్నారు. చిరంజీవి తన అల్లుడు కళ్యాణ్ దేవ్ కోసం రాబోతున్నారు. ఈ నెల 24న ఈ ఫంక్షన్ జరుగుతుంది.

మెగా క్యాంప్ లో కొత్తగా యాడ్ అవుతున్న హీరో కళ్యాణ్ దేవ్. మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె భర్త. ఈ హీరోతో సాయి కొర్రపాటి ఒక సినిమాను విజేత టైటిల్ తో నిర్మించారు. ఈ సినిమా వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 24న భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు.

ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ స్కేల్ లో వుండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ వేదికే ఇప్పుడు చిరు-బాలయ్య కలిసి అభిమానులను కనువిందు చేయడానికి అవకాశంగా మారుతోంది. ఒక్క హీరో వస్తేనే ఫ్యాన్స్ ఊగిపోతారు. మరి ఇద్దరు వస్తే..ఓ రేంజ్ లో వుంటుంది హడావుడి. మధ్యతరగతి తండ్రీ కొడుకుల నేఫథ్యంలో విజేత సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కళ్యాణ్ ధేవ్ సరసన మాళవిక నాయర్ నటిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?