రాజమౌళి బీజేపీకి మద్దతిస్తాడా?

దేశవ్యాప్తంగా సెలబ్రిటీల మీద పడింది భారతీయ జనతా పార్టీ. స్వయంగా అమిత్ షా దగ్గర నుంచినే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైంది. భారత క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ ను కలిసి.. ఈ కార్యక్రమానికి శ్రీకారం…

దేశవ్యాప్తంగా సెలబ్రిటీల మీద పడింది భారతీయ జనతా పార్టీ. స్వయంగా అమిత్ షా దగ్గర నుంచినే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైంది. భారత క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ ను కలిసి.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు అమిత్ షా.

మోడీ ప్రభుత్వం చక్కగా పని చేస్తోందని, మంచి మంచి కార్యక్రమాలు చేపడుతోందని.. కాబట్టి వచ్చేసారి కూడా మోడీ ప్రభుత్వం వచ్చేందుకు అనుగుణంగా బీజేపీకి మద్దతు పలకాలని షా కపిల్‌ను అడిగాడు.

ఇక్కడ డైరెక్టుగా బీజేపీకి మద్దతు అడగకపోయినా.. మోడీ సర్కారు మళ్లీ.. అనే నినాదానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వీరిని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి జాబితాలో చాలా మంది సెలబ్రిటీలనే సిద్ధం చేసుకుంది బీజేపీ.

బాలీవుడ్ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో మాజీలు, సినిమా వాళ్లను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ప్రాంతీయ సినిమాల వాళ్లు కూడా ఉన్నారు. అందులో భాగంగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ అహిర్ వచ్చి కలిశాడు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా రాజమౌళిని, ఆయన తండ్రిని కలిసి సన్మానించారు.

ఆపరేషన్ సెలబ్రిటీస్‌లో బాగంగా వీరు రాజమౌళి మద్దతును కూడా కోరినట్టుగా తెలుస్తోంది. వారి కోరిక మేరకు రాజమౌళి బీజేపీకి మద్దతు పలుకుతాడా? మళ్లీ మోడీ సర్కారే నినాదానికి మద్దతుని ఇస్తాడా? ఇవతల చంద్రబాబు నాయుడు మోడీ మీద గయ్యిమంటున్న నేపథ్యంలో రాజమౌళి బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగే పనేనా?