ఒక్క హీరోయిన్ దొరకడం లేదంటే..

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ సాధినేని దర్శకుడు. అసలే హీరోయిన్ల కొరత ఎక్కువగా వుంది. తెలుగు సినిమాలకు, హీరోలకు హీరోయిన్ల కొరత ఎక్కువగా వుందని…

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ సాధినేని దర్శకుడు. అసలే హీరోయిన్ల కొరత ఎక్కువగా వుంది. తెలుగు సినిమాలకు, హీరోలకు హీరోయిన్ల కొరత ఎక్కువగా వుందని కిందామీదా అవుతుంటే, ఈ సినిమాకు ఏకంగా నలుగురు హీరోయిన్లు కావాలంట.

రవితేజ నా ఆటోగ్రాఫ్ మాదిరి కథ అని తెలుస్తోంది. ఓ యువకుడి వివిధ దశల్లో ప్రేమగాథలన్నమాట. ఎర్లీ దశలో కథ కోసం హీరోయిన్ గా చిన్న అమ్మాయిని ఒకరిని ఎంపిక చేసేసారు. మజిలీ సినిమాలో నాగచైతన్య కూతురుగా నటించిన బాలీవుడ్ బాలనటి కమ్ టీనేజ్ గర్ల్ అనన్య అగర్వాల్ ను ఫైనల్ చేసేసారు.

ఇక 18 ఏళ్లు, పాతికేళ్లు, ముఫై ఏళ్లు ఇలా వివిధ దశల్లో మరో ముగ్గురు హీరోయిన్లు కావాలని వెదుకుతున్నారట. కొత్త హీరో సరసన నటించడానికి ఎవరెవరు ముందుకు వస్తారో చూడాలి. బెల్లంకొండ సినిమా కాబట్టి కాస్త పారితోషికం ఎక్కువ ఆఫర్ చేసయినా తీసుకువస్తారు అనుకోవాలి. 

సినిమా రివ్యూ: రాజుగారి గది 3