బాలయ్య తాజా సంచలనం లయిన్ ట్రయిలర్ వచ్చింది. సినిమా అచ్చమైన బాలయ్య సినిమాగా తయారవుతోందని చెప్పకనే చెప్పింది. ఒక్క ట్రయిలర్ లోనే చాలా షేడ్స్ చూపించారు. బాలయ్య పాత్ర అటు క్లాస్, ఇటు మాస్, ఇలా చాలా విధాలుగా వుండేటట్టుగానే వుంది. మాంచి మాస్ పాటకు బాలయ్య గళ్ల డ్రెస్ వేసి డ్యాన్స్ చేసాడు.
Advertisement
అది చాలు అభిమానులు పరవశించడానికి. బాలయ్య మార్కు డైలాగులు కూడా బాగానే పడ్డాయి ట్రయిలర్ లో. అన్నీ బాగానే వున్నాయి కానీ, తాను చేయి చాచే వరకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదంటాడేమిటి? షేక్ హ్యాండ్ అవతలి వాడు ముందే ఇస్తే మనకే గౌరవం కదా?