మళ్లీ అమెరికా వెళ్లిపోతున్నాడు

మొన్నటికి మొన్న “లై” సినిమా కోసం ఏకంగా 2 నెలలు అమెరికాలో ఉండి వచ్చాడు నితిన్. సినిమాకు సంబంధించిన కొన్ని ఫస్ట్ లుక్స్ తో పాటు ఓ పాటను కూడా అమెరికా నుంచే రిలీజ్…

మొన్నటికి మొన్న “లై” సినిమా కోసం ఏకంగా 2 నెలలు అమెరికాలో ఉండి వచ్చాడు నితిన్. సినిమాకు సంబంధించిన కొన్ని ఫస్ట్ లుక్స్ తో పాటు ఓ పాటను కూడా అమెరికా నుంచే రిలీజ్ చేశారు. అలా భారీ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ వచ్చిన నితిన్.. “లై” సినిమా రిలీజ్ అవ్వకముందే మరోసారి అమెరికాకు వెళ్లిపోతున్నాడు. 

త్వరలోనే కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలు. త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. అది కూడా 40 రోజుల భారీ షెడ్యూల్.

హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న లై సినిమా పూర్తయి, థియేటర్లలోకి వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతోంది. మేకర్స్ ప్రకటించినట్టు ఆగస్ట్ లో ఈ సినిమా విడుదల ఉండకపోవచ్చు. ఎందుకంటే సినిమాకు సంబంధించి ఇంకో భారీ షెడ్యూల్ బాకీ ఉంది. పైగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పెండింగ్ ఉంది.

సో.. ఈ గ్యాప్ లో కొత్త సినిమా ప్రారంభించాలని అనుకుంటున్నాడు నితిన్. లై సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మేఘ ఆకాష్ నే కృష్ణ చైతన్య సినిమాలో కూడా రిపీట్ చేస్తున్నాడు.