థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. అక్టోబర్ లో కానీ థియేటర్లు వుండవు. దాంతో ఒక్కోసినిమా మెలమెల్లగా డీల్ ఫైనల్ చేసుకుంటూ ఓటిటి లోకి ఎంటర్ అవుతున్నాయి. ఇప్పటికే వి సినిమా విడుదల ఫిక్స్ అయింది. ఈవారమో, వచ్చేవారమో నిశ్శబ్దం, మిస్ ఇండియా డేట్ లు కూడా వచ్చేస్తాయి.
వర్క్ పెండింగ్ లో వున్న సోలో బతుకే సో బెటర్ కూడా ఓటిటికి ఫిక్స్ అయిపోయింది. క్రాక్ అటు ఇటు ఊగుతోంది. ఉప్పెన, రెడ్ సినిమాలు ఇంకా థియేటర్ ఆప్షన్ తోనే వున్నాయి. దాంతో దాదాపు రెడీకి కాస్త అటు ఇటుగా వున్న సినిమాలు అన్నీ పూర్తయిపోయినట్లే.
సగానికి కాస్త అటు ఇటుగా తయారైన సినిమాలు మాత్రం సంక్రాంతికి డేట్ లు పెట్టుకుని కూర్చున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అన్ని పాముల మధ్య వానాపాముగా మిగిలిన చిన్న సినిమా ఒరేయ్ బుజ్జిగా కూడా ఓటిటి దాని పట్టేసింది. ఈ సినిమా డీల్ కూడా ఓ ఓటిటి సంస్థతో పూర్తి అయినట్లు తెలుస్తోంది.
మూడున్నర కోట్లు ఓటిటికి, కోటిన్నర శాటిలైట్ కు మొత్తం అయిదు కోట్లు రిటర్న్ వుండేలా డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇది కూడా ఈవారంలో ప్రకటన వచ్చే అవకాశం వుంది.