రాశిఫలాలు.. 30.08.20 నుంచి 05.09.20 వరకు

మేషం: కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలతో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చర్చలు సఫలమవుతాయి. ఆర్థికం….ఆదాయం సంతప్తినిస్తుంది. కొంతమేర…

మేషం: కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలతో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చర్చలు సఫలమవుతాయి. ఆర్థికం….ఆదాయం సంతప్తినిస్తుంది. కొంతమేర రుణాలు సైతం తీరే సూచనలు. భవిష్యత్తు అవసరాలకు కొంత నిల్వ చేస్తారు. కుటుంబం…బంధువుల యోగక్షేమాలు ఊరటనిస్తాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. వివాహాది వేడుకలపై చర్చలు సాగిస్తారు. ఆరోగ్యం….స్వల్ప రుగ్మతలు బాధించినా ఉపశమనం పొందుతారు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగులకు ఎట్టేకలకు ెదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళల ఆశలు ఫలిస్తాయి. సూర్యారాధన మంచిది.

వృషభం: దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీసత్తా, ప్రతిభ చాటుకునేందుకు సరైన సమయం. ఒక ప్రకటన ద్వారా నిరుద్యోగులకు ఉపశమనం లభిస్తుంది. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ల వారికి చెప్పుకోతగ్గ ప్రగతి ఉంటుంది. ఆర్థికం.. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అనుకున్న అవసరాలకు డబ్బు సమకూరుతుంది. షేర్ల విక్రయాలు పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు. కుటుంబం….సోదరులు, సోదరీలతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. ఆస్తుల విషయంలో వారితో అంగీకారానికి వస్తారు. ఆరోగ్యం….శారీరక రుగ్మతలు బాధిస్తాయి.వైద్యసేవలు స్వీకరిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.  పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు.  మహిళలకు ఆసక్తికర సమాచారం రాగలదు. గణపతి స్తోత్రాలు పఠించండి.

మిథునం: తలకు మించిన బాధ్యతలు మీదపడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కొందరు మీపై అపవాదులు మోపుతారు. ఆర్థికం….ఆదాయం అంతగా కనిపించగా, డీలాపడతారు. కొత్త రుణాల కోసం అన్వేషించి విఫలమవుతారు. ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన సమయం. కుటుంబం…కుటుంబ పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి. మీరు ఏమి చెప్పినా కుటుంబసభ్యులు వ్యతిరేకించడం ఇబ్బంది కలిగిస్తుంది. సంతాన ఆరోగ్యంపై కొంత కలత చెందుతారు. అయినా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు. ఆరోగ్యం….గతం కంటే మెరుగుపడి ఊరట చెందుతారు.  వ్యాపార లావాదేవీలలో కొద్దిపాటి లాభాలు.పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు మానసిక ఆందోళన పెరుగుతుంది. ప్రతి విషయాన్ని తీవ్రంగా తీసుకుంటారు.  కుమారస్వామి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: మీ కషి, ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌రంగం వారికి కొన్ని అవాంతరాలు. ఆర్థికం…రావలసిన డబ్బు సమకాలంలో అందక ఇబ్బంది పడతారు. రుణబాధలు తప్పవు. ఇతరులకు హామీలు ఇచ్చి కొంత ఇరుకున పడే అవకాశం. జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబం….మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. సోదరులతో కొన్ని విషయాలపై చర్చిస్తారు. అయితే ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంటారు. సంతానపరంగా కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. వాటి పరిష్కారానికి శ్రమిస్తారు. ఆరోగ్యం….స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. వైద్యులను సంప్రదిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు, పెట్టుబడుల్లో జాప్యం. ఉద్యోగస్తులకు మార్పులు కొంత అయోమయాన్ని కలిగిస్తాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. మహిళలకు లేనిపోని చికాకులు. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చడంలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. ఆర్థికం….ఆశించిన రాబడి సమకూరి అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తగ్గవచ్చు. స్థిరాస్తుల్లో పెట్టిన పెట్టుబడులకు తగినంత లాభాలు దక్కుతాయి. కుటుంంబ….భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానపరంగా సమస్యలు తీరతాయి. శుభకార్యాలపై ప్రణాళికలు రూపొందిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొంత అనుకూల సమయమనే చెప్పాలి. మహిళలకు మనోధైర్యం మరింత పెరుగుతుంది.. శుక్రగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య: ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు కొలిక్కి వస్తాయి. ఇతరులకు సైతం సహాయపడి మంచితనాన్ని చాటుకుంటారు. ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలలో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థికం…..ఆదాయానికి లోటు ఉండదు. రుణాలు తీరి మనశ్శాంతి పొందుతారు. ఇతరులు సైతం మీకు సకాలంలో బాకీలు చెల్లించడం విశేషం. కుటుంంబ…బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారు. సంతానపరంగా చికాకులు తొలగుతాయి. ప్రస్తుత పరిస్థితులను అధిగమించి కొంత ఊరట చెందుతారు. ఆరోగ్యం…కొంత ఇబ్బంది కలిగించినా క్రమేపీ ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల్లో సాగుతాయి. భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది.  రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగల సమయం. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. ఈశ్వరారాధన మంచిది.

తుల: ముఖ్యులతో చర్చలు మధ్యలో నిలిపివేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించక డీలాపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థికం….రావలసిన సొమ్ము అందక, మరోవైపు రుణయత్నాలు ఫలించక నిరాశ చెందుతారు. పెట్టుబడుల్లోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబం…భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. విదేశాలలోని మీ సంతానం నుంచి అందిన సమాచారం కొంత గందరగోళం కలిగిస్తుంది. అయితే మనోధైర్యంతో అధిగమిస్తారు. ఆరోగ్యం.. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వైద్యసలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం మీదపడుతుంది. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి గందరగోళ పరిస్థితి ఉంటుంది. మహిళలకు మానసిక ఆశాంతి. దేవీఖడ్గమాల పఠించండి.

వశ్చికం: వ్యవహారాలలో కొద్దిపాటి అవాంతరాలు. దూరప్రాంతాల నుంచి ఆసక్తికర సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మరింత నిదానం అవసరం. దైవదర్శనాలు చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. ఆర్థికం…..కొంత ఇబ్బంది కలిగినా అవసరాలకు ఏదో విధంగా సమకూరుతుంది. రుణదాతలు మరోవైపు ఒత్తిళ్లు పెంచుతారు. కుటుంబం….సోదరులు, సోదరీలతో ఆస్తి వివాదాలు నెలకొనే సూచనలు. కొన్ని నిర్ణయాలు ఎటూతేల్చుకోలేక సతమతమవుతారు. శుభకార్యాలపై చర్చిస్తారు. ఆరోగ్యం…కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. అయితే క్రమేపీ ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం తప్పదు. పదోన్నతులు నిలిచిపోయే అవకాశం. కళాకారులకు శ్రమ మిగులుతుంది.  మహిళలకు మనోధైర్యం తగ్గి నిరాశ చెందుతారు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

ధనుస్సు: మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. ఒక సంఘటన మీలో మార్పు తెచ్చే వీలుంది.. ప్రత్యర్థులు మీపై అపవాదులు మోపే వీలుంది, మెలకువగా ఉండండి. కాంట్రాక్టర్లకు నిరాశ తప్పకపోవచ్చు. దేవాలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలలో ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు. ఆర్థికం….ఇచ్చిన హామీల మేరకు సొమ్ములు చెల్లించలేక సతమతమవుతారు. మీకు రావలసిన మొత్తాలు నిలిచిపోయే సూచనలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబం.. సోదరులు, సోదరీలతో వివాదాలను కొనితెచ్చుకుంటారు. మీ నిర్ణయాలు వ్యతిరేకిస్తారు. సంతానపరంగా కొంత ఇబ్బందికరమైన సమాచారం అందుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు. పనిభారం తప్పుదు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. మహిళలకు మానసిక ఆందోళన.. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం: కొత్త కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆస్తి విషయాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయం. ఆర్థికం….రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. రుణాలు చాలావరకూ తీరతాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబం….అందరితోనూ సఖ్యంగా మెలుగుతారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మీ ఆలోచనలు పెద్దలతో పంచుకుంటారు. సంతానపరంగా వివాదాలు సర్దుకుంటాయి. ఆరోగ్యం….శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారాలు వద్ధిబాటలో సాగుతాయి. భాగస్వాములు మరింత సహకరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది. నిదానం అవసరం. విలాసాలకు దూరంగా ఉండండి. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌వారు శ్రమపడ్డా ఫలితం పొందలేరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికం…కొంత సొమ్ము అందినా అవసరాలకు చాలక రుణాలు చేస్తారు. రుణదాతలు ఒత్తిడులు మరింత పెంచుతారు. పెట్టిన పెట్టుబడుల్లో సైతం సందిగ్ధతత నెలకొంటుంది. కుటుంబం…సోదరులు,సోదరీలతోనూ, జీవిత భాగస్వామితోనూ విభేదాలు ఏర్పడవచ్చు. సంతానం నుంచి అందిన ఒక సమాచారం కొంత ఊరట కలిగించవచ్చు. వ్యాపారాలలో భాగస్వాముల మధ్య విభేదాలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉండవచ్చు. కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి విమర్శలు ఎదురుకావచ్చు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. రహస్య పరిశోధకులకు విజయాలు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు పాటిస్తారు.ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు తారసపడి కొన్ని సలహాలు ఇస్తారు. ఆర్థికం.. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. రుణబాధలు తీరతాయి. కొత్త పెట్టుబడుల రూపంలో సొమ్ము నిల్వ చేస్తారు. కుటుంబం….అందరి ప్రేమాభిమానాలు పొందుతారు. కుటుంబసభ్యులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటారు. వివాహాది వేడుకలపై అందరితోనూ చర్చిస్తారు. సంతానపరంగా చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు, పెట్టుబడులు సైతం పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు కార్యసిద్ధి. మంచి గుర్తింపు లభిస్తుంది. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

Vakkantham Chandra Mouli 
www.janmakundali.com