కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు బంద్ కావడంతో చిన్న, మీడియం సినిమాలు ఓటిటి దారికి పట్టడం కామన్. ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లు కూడా ఎక్కడ కంటెంట్ దొరుకుతుందా అని చూస్తున్నాయి. అయితే కరోనా రెండో ఫేజ్ లో సినిమాలు ఎక్కువ రెడీ కాకుండా వుండడంతో, ఓటిటికి సినిమాలు చిక్కడం లేదు.
ఇటీవలే ఏక్ మినీ కథ ను ఓటిటి ఇచ్చేసారు. హీరో సత్యదేవ్ నటించిన తిమ్మరసు సినిమా కూడా ఇప్పుడు ఓటిటి దారిలో పయనిస్తోంది. కన్నడ రీమేక్ అయిన ఈ సినిమా ఇప్పటికే పూర్తిగా రెడీ అయిపోయింది. అందువల్ల ఓటిటి బేరాలు ప్రారంభమయ్యాయి.
అయితే బేరాలు తెగాల్సి వుంది. వన్స్ బేరం తెగితే త్వరలో తిమ్మరసు ఓటిటి లోకి వచ్చేసింది. సత్యదేవ్ సరసన ప్రియాంక నటించిన ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. ఇతగాడు గతంలో కన్నడ సినిమా కిర్రాక్ పార్టీని తెలుగులో అందించాడు.
మళ్లీ మరో కన్నడ సినిమా ను బేస్ చేసుకునే తిమ్మరసు రూపొందించాడు. ఓ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా కథ తయారు చేసారు.