టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త కథలు, అన్ని ప్రాంతాలకు నప్పే కథలు తయారవుతున్నాయి. వాటితో సినిమాలు చేస్తున్నారు. ఎలాగూ అన్ని భాషలకు నప్పుతాయి కనుక, ఆయా భాషల్లో కూడా విడుదల చేయడం అన్నది అలవాటు అవుతోంది.
ప్రతి హీరో ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఇదే బాట పడుతున్నారు. కళ్యాణ్ రామ్ 18వ సినిమా ఇది. ఆయన బ్యానర్ మీద హరి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ ను రేపు అనౌన్స్ చేస్తున్నారు. అయితే ముందుగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసారు. టైం ట్రావెల్ మూవీ అన్న హింట్ ఇచ్చేసారు.
కొత్త దర్శకుడు వశిష్ట్ రూపొందిస్తున్న ఈ భారీ సినిమా పలు ఇండియన్ లాంగ్వేజెస్ లో తయారవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమాకు టైటిల్ ను కూడా అన్ని లాంగ్వేజెస్ కు సెట్ అయ్యేలా ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.