కోవిడ్ కేసులు, లాక్ డౌన్ ల కారణంగా సినిమాల విడుదలలు ఆగిపోయాయి. పెద్ద సినిమాలు టైమ్ కోసం నిరీక్షిస్తుంటే చిన్న సినిమాలతో ఒటిటి ప్లాట్ ఫారమ్ లు బేరాలు సాగిస్తున్నాయి.
యువి సంస్థ నిర్మించిన చిన్న సినిమా ఏక్ మినీ కథ కూడా అమెజాన్ ప్రయిమ్ తో బేరాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మేర్లపాక మురళి సూపర్ విజన్ లో తయారైన అడల్ట్ టచ్ కామెడీ సినిమా ఇది.
సంతోష్ శోభన్ హీరో. చాలా తక్కువ బడ్జెట్ తో తయారైన ఈ సినిమా నిజానికి ఓటిటికే సూట్ అవుతుందని టాక్. ఎందుకంటే కాస్త బోల్డ్ అడల్డ్ పాయింట్ తో క్లాస్ కామెడీ టచ్ తో తయారైన సినిమా ఇది థియేటర్లో అంటే జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు.
అదే ఓటిటి అయితే ఎవరి మొబైళ్లలో వారు హ్యాపీగా చూసేస్తారు. అయితే ప్రస్తుతానికి బేరసారాలు సాగుతున్నాయి.
నిజానికి యువి సంస్ధ థియేటర్ విడుదలకే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక సరైన లాభసాటి రేటు కనుక వస్తే ఓటిటికి ఇచ్చే అవకాశం ఇస్తుందని తెలుస్తోంది.