ఓయ్ సినిమా గుర్తుందా? సిద్దార్థ హీరో. అతగాడి పక్కన వేసింది, పెద్దయిన బేబీ షామిలి. ఆ తరువాత మళ్లీ మనకు కనిపించలేదు. అక్కడ షాలిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఈమె మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూంది. ఓయ్ సినిమాలో కాస్త బొద్దుగా వున్న షామిలి ఇప్పుడు మాంచి అందంగా తయారైంది. అందుకే తెలుగులో చాన్స్ వెదక్కుంటూ వచ్చింది.
హాంగ్ కాంగ్ లో సెటిల్ అయిన ఎన్నారై లు నిర్మాతలుగా స్వాజిత్ మూవీస్ పతాకంపై సుందర్ సూర్య అనే కొత్త దర్శకుడు రూపోందిస్తున్న అమ్మమ్మగారిల్లు అనే సినిమాలో షామిలి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ సినిమాలో నాగశౌర్య హీరో. ఈ సినిమాకు మాంచి సాంకేతిక వర్గం పనిచేస్తోంది. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, కళ్యాణ్ రమణ (కళ్యాణ్ మాలిక్) సంగీతం, సిరివెన్నెల సింగిల్ కార్డ్ సాహిత్యం ఈ సినిమా మీద అంచనాలు ఏర్పరుస్తున్నాయి.
అమ్మమ్మగారిల్లు అంటూ మాంచి ఫీల్ గుడ్ టైటిల్ పెట్టిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం సుందర్ సూర్య నే. దాదాపు 70శాతానికి పైగా పూర్తయిన ఈ సినిమా సమ్మర్ లేదా పోస్ట్ సమ్మర్ టైమ్ లో జనం ముందుకు వస్తుంది.