సినిమా పాత్రకు అనుగుణంగా బాడీని షేపప్ చేసుకునే హీరోల జాబితాలో నిఖిల్ కూడా చేరిపోయాడు. త్వరలో చేయబోయే కన్నడ సినిమా కిర్రాక్ పార్టీ తెలుగు అనువాదంలో క్యారెక్టర్ కోసం పది కిలోల బరువు పెరిగాడట.
ఇందుకోసం యుకె వెళ్లి ఇరవై రోజులు వుండి, స్పెషల్ గా జిమ్ ట్రయిన్ అయివచ్చాడు. దీంతో మాంచి కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు నిఖిల్. ఇంకా కొన్ని కిలోలు పుటప్ చేసి, బాడీ ఫుల్ షేప్ కు వచ్చాక, అప్పుడు ఫోటో షూట్ చేసి, జనాల ముందుకు రావాలని అనుకుంటున్నాడట నిఖిల్.
ఇప్పటికే నిఖిల్ ను బయట చూసిన వారు, ప్రొఫైల్ పిక్స్ చూసిన వారు, వావ్ అంటున్నారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా బ్లాక్ బస్టర్ నిఖిల్ చేసిన కేశవ ఏవరేజ్ అనిపించుకుంది.
అందుకే ఈసారి ఎలాగైనా మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని కిర్రాక్ పార్టీ అనువాదంపై గట్టిగా దృష్టి పెట్టాడు. త్వరలో మరో తమిళ సినిమా గణితన్ అనువాదం కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి తరువాత దిల్ రాజు నిర్మాణంలో చందు మొండేటి డైరక్షన్ లో సినిమా చేయాల్సి వుంటుంది.