రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఇటీవల ఐస్ క్రీమ్ తో సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పై దృష్టి సారించాడు. డబ్బుల్లేకుండా, కోపరేటివ్ పద్దతిలో సినిమా తీయచ్చు అనే కొత్త అయిడియా ఇచ్చాడు. అది ఏ మేరకు సాధ్యం అన్నది పక్కన పెడితే, దానిపై కాస్త డిస్కషన్ అయితే జరిగింది..జరుగుతోంది.
అయితే ఏదో విధంగా సినిమా తీస్తే, అసలు పంపిణీ చేసేవాళ్లు ఎవరు అన్నది పెద్ద ప్రశ్న. ఇటీవల రామ్ అయిడియాను చాలా మంది ప్రశ్నించింది కూడా ఇక్కడే. అందుకే ఇప్పడు రామ్ గోపాల్ వర్మ పంపిణీ రంగంపై దృష్టి పెట్టాడని వినికిడి.
అంటే ఆయన ఓ పంపిణీ సంస్థను ప్రారంభిస్తున్నాడని కాదు అర్థం. సినిమా నిర్మాణానికి, ప్రదర్శనకు మధ్య పెద్ద అడ్డంకిగా వున్న పంపిణీ రంగాన్ని ఎలా అధిగమించాలి, దాన్ని కూడా ఎలా కొత్త పుంతలు తొక్కించాలి అన్నది ఆయన ఆలోచన. ఇప్పటికే దీనిపై ఆయన ఓ థియరీ కమ్ ప్రాక్టికల్స్ కు అన్నీ రెడీ చేసుకున్నట్లు వినికిడి. అంతా ఓకె అయితే త్వరలో రామ్ ఓ కొత్త సంచలనంతో జనం ముందుకు వచ్చే అవకాశం వుంది.