పాపం..ఎన్టీఆర్

అందరు హీరోలు ఏదో ఒకలా చకచకా ముందుకు పోతుంటే ఎన్టీఆర్ పరిస్థితి మాత్రం ఏలినాటి శని సోకిన గ్రహస్థితిలా కిందా మీదా అవుతోంది. సరే, టెంపర్ అనే సినిమా చేసాడు. ఇంతో అంతో హడావుడి…

అందరు హీరోలు ఏదో ఒకలా చకచకా ముందుకు పోతుంటే ఎన్టీఆర్ పరిస్థితి మాత్రం ఏలినాటి శని సోకిన గ్రహస్థితిలా కిందా మీదా అవుతోంది. సరే, టెంపర్ అనే సినిమా చేసాడు. ఇంతో అంతో హడావుడి జరిగింది. కాస్తో కూస్తో పేరువచ్చింది. మరి ఆ వ్యవహారం ముగిసి మూడ్నెల్లు అవుతోందా? అయినా ఇంతవరకు తరువాతి సినిమా అతీగతీ లేదు. 

ఇదిగో యూరప్ అంటారు..అదిగో షూటింగ్ అంటారు. కానీ ఎక్కడ వేసిన రాయి అక్కడే. పోనీ మరో సినిమా ఏదయినా ఒప్పుకున్నాడా అంటే అదీ లేదు. కనీసం స్క్రిప్ట్ డిస్కషన్ల జాడయినా వుందా అంటే అదీ లేదు. ఏ నిర్మాత, ఏ దర్శకుడు ఎన్టీఆర్ దాపులకు వెళ్తున్న దాఖలాలు లేవు. ఎన్టీఆర్ నమ్ముకున్న వినాయక్. రాజమోళి, బోయపాటి అందరూ బిజీ బిజీ, వేరే హీరోలతో.  

దాదాపు రెండేళ్ల కాలంగా ఎన్టీఆర్ పరిస్థితి ఇలాగే వుంటోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. అయినా ఏ సినిమా ఫస్ట్ లుక్ లేదు, టీజర్ లేదు. మరే హడావుడి లేదు. ఓ టాప్ హీరో పరిస్థితి ఇలా వుందంటే కాస్త బాధాకరమే. అందుకే ఎన్టీఆర్ కనీసం తన కొడుకు ఫొటో అయినా చూపించి అభిమానులను సంతోష పెట్టాలని అనుకుంటున్నాడు. ఎన్టీఆర్ కళకళలాడుతూ ఏటా రెండు సినిమాలు చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుందో?