రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వెరైటీనే. ఆయన ఆలోచనలే అలా వుంటాయి. యువతీ యువకుల ప్రేమలు, పెళ్లిళ్లు, పెటాకులపై ఓ సినిమ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి 365 అనిపేరు పెట్టాడు. ఆ మధ్య ట్రయిలర్ చూపించాడు. వచ్చిన అతిధుల చేత పెళ్లిపై అభిప్రాయాలు వెల్లడించాడు.
Advertisement
ఇప్పడుఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా రంగానికి చెందిన తన సన్నిహితులకు, మీడియాకు పెళ్లి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి టైటిల్ ఆర్జీవీ పెళ్లి భోజనాలు. బహుశా ఈ కార్యక్రమం మంగళవారం వుండొచ్చేమో?