ఒక్కో అసిస్టెంట్ నో, అసోసియేట్ నో ఒక్కో హీరోను అనుకోకుండా నమ్ముకుంటాడు. ఎప్పటికైనా దర్శకుడు అని పేరు వేసుకోవడానికి ఆ హీరో చాన్స్ ఇస్తాడని నమ్మకం పెట్టుకుంటాడు. అలాగే నితిన్ దగ్గర ఓ అసొసియేట్ వున్నాడు. ఎప్పటికైనా తనకు దర్శకత్వం అవకాశం ఇస్తాడని,నితిన్ చుట్టూ తిరుగుతున్నాడో ఔత్సాహిక డైరక్టర్..ఎప్పటికైనా సినిమా చేయాలని ఆశ.
చాలా మంది మాదిరిగానే. సరిగ్గా సినిమా చేద్దాం అనుకుంటే ఎవరో ఒకరు వచ్చి నితిన్ సినిమా తన్నుకుపోతున్నారు. పూరి జగన్నాధ్ ఓసారి అడ్డం పడ్డాడు. ఆ తరువాత కరుణాకరన్ సినిమా వచ్చింది. సరైన హిట్ లేదు..ఇక మనకే చాన్స్ ఇస్తాడు గ్యారంటీగా అనుకున్నాడు పాపం, డైరక్షన్ చాన్స్ కోసం నితిన్ తో వుంటూ, నితిన్ నే నమ్ముకున్న ఆ కుర్రాడు.
అంతలో త్రివిక్రమ్ వచ్చాడు..చాన్స్ అటు వెళ్లింది. పోనీ త్రివిక్రమ్ లాంటి పెద్ద డైరక్టర్ తరువాతి సినిమా తనదీ అనుకున్నాడు. ఇప్పుడు నేను శైలజ డైరక్టర్ తిరుమల సీన్లోకి వచ్చాడు. దాంతో తాను నితిన్ తో డైరక్ట్ చేయాల్సిన సినిమా జీవిత కాలం లేటా అనుకుంటూ నిట్టూరుస్తున్నాడా కుర్ర డైరక్టర్.