ఓ పెద్ద డైరక్టర్, ఓ చిన్న సినిమాకు కథ ఇచ్చి, డిఫరెంట్ టైటిల్ ఇస్తే, కచ్చితంగా ఏదో వుంటుంది విషయం అనిపిస్తుంది. సంపత్ నంది లాంటి డైరక్టర్ పేపర్ బాయ్ అనే చిన్నసినిమాను తానే కథ, ఇచ్చి నిర్మిస్తున్నారంటే, ఏదో వెరైటీ వుంటుందనే అనుకోవాల్సిందే. ఫస్ట్ లుక్, టీజర్ విడుదలకు సంబంధించిన ప్రకటనలు అన్నీ న్యూస్ ఫేపర్ కట్టలతో నింపేస్తుంటే, ఇదేదో కచ్చితంగా డిఫరెంట్ సినిమా అనిపించింది.
కానీ తీరా టీజర్ వచ్చిన తరువాత ఆ డౌట్లు అన్నీ క్లారిఫై అయిపోయాయి. టీజర్ రిచ్ గా వుంది. కలర్ ఫుల్ గా వుంది. సంపత్ నంది సినిమాలు అన్నీ కలర్ పుల్ గా, రిచ్ గానే వుంటాయి. అందువల్ల టీజర్ కూడా అలా వుండడంలో ఆశ్చర్యంలేదు.
కానీ టీజర్ లో విషయం చూస్తుంటే మామూలు సినిమానే అనిపిస్తోంది. ఓ బీటెక్ చదివిన కుర్రాడు పార్ట్ టైమ్ పేపర్ బాయ్ గా పనిచేయడం, పనిలో పనిగా ఒక పెద్దింటి అమ్మాయి ప్రేమలో పడిపోవడం అన్నది టీజర్ చెబుతున్న సంగతి. మరీ పెద్దింటి అమ్మాయి పేపర్ బాయ్ ప్రేమలో పడిపోతే 1980ల కాలం నాటి సినిమా అనుకునే అవకాశం వుంది కాబట్టి, బీటెక్ క్వాలిఫికేషన్ జోడించినట్లు కనిపిస్తోంది.
పేపర్ బాయ్, పేపర్ కట్టలు, అమ్మాయిని సైకిల్ మీద కూర్చో పెట్టుకుని, ఇళ్లకు పేపర్లు ఇవ్వడం అన్నీ, సమ్ థింగ్ న్యూ అనిపించుకోవడం కోసం తప్ప, సినిమా అయితే మామూలు సినిమానే అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే.