cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

'పప్పు' సుద్ద క్యారెక్టర్ లో బండ్ల

'పప్పు' సుద్ద క్యారెక్టర్ లో బండ్ల

ఒకప్పటి కమెడియన్, తరువాత నిర్మాత అయిన బండ్లగణేష్ మళ్లీ మొహానికి మేకప్ వేసుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు 26వ సినిమాలో అనిల్ రావిపూడి డైరక్షన్ లో నటించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ అచ్చం బండ్ల గణేష్ మాట తీరును పోలి వుంటుందని తెలుస్తోంది.

బాగా డబ్బు వుండి కూడా పప్పు సుద్దలా వుంటూ, ఉత్తర కుమారుడిలా ఏవేవో మాట్లాడే క్యారెక్టర్ లాంటిది ఒకటి అనిల్ రావిపూడి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ పక్కాగా బండ్ల గణేష్ మాదిరిగా వుంటుందన్నమాట. అందుకే ఏరికోరి బండ్ల గణేష్ ను ఆ క్యారెక్టర్ కు అనిల్ రావిపూడి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మహేష్ తో సినిమా అంటే అనిల్ రావిపూడికి గోల్డెన్ చాన్స్. ఇది హిట్ అయితే టాప్ లైన్ డైరక్టర్ల జాబితాలోకి చేరిపోతారు. అందుకే అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ కథను తయారుచేసి, ష్యూర్ షాట్ హిట్ అనే మాదిరిగా స్క్రిప్ట్ తయారుచేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఎనిమిది నెలల్లో సినిమా పూర్తిచేసి సంక్రాంతికి విడుదలకు రెడీ చేయాలని పక్కాగా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశంలోనూ విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్!

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?