బాలీవుడ్‌లో చేసిన సినిమాలు చేసినట్టే ఫ్లాపవుతోంటే, తాను మాత్రం సక్సెస్ వచ్చేదాకా బాలీవుడ్‌ని వదిలేది లేదంటోంది. ఆమె ఎవరో కాదు, మిల్కీ బ్యూటీ తమన్నా. టాలీవుడ్‌లో ఓ దశలో నెంబర్ వన్ పొజిషన్ దగ్గరగా వెళ్ళిన తమన్నా, ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అవ్వాలనుకుంటోంది.
సినిమాలైతే చేస్తోందిగానీ, తమన్నాకి బాలీవుడ్‌లో ఒక్కటంటే ఒక్క హిట్టూ దొరకడంలేదు. ‘వస్తుందిలే టైమ్ వచ్చినప్పుడు.. అప్పటిదాకా నిరాశపడకూడదు..’ అంటూ తమన్నా, తనను తాను సముదాయించుకుంటోంది. తాజా ఫ్లాప్ ‘హమ్‌షకల్స్’తో కాస్త కుదేలైన తమన్నా, అంతలోనే తేరుకుని సినిమా యూనిట్‌కి పెద్ద పార్టీ ఇచ్చిందట.
ఫ్లాప్ సినిమాకీ పార్టీ ఇస్తారా.? అని తమన్నానని చూసి అంతా ఆశ్చర్యపోయారు. తొలి సినిమా డిజాస్టర్.. దాంతో పోల్చితే, 50 కోట్లు వసూలు చేసిన సినిమా గొప్పే కదా.. అంటోందట తమన్నా. అయితే తమన్నా పార్టీల వెనుక పెద్ద కహానీయే వుందట. అలా పార్టీలు ఇవ్వడం ద్వారా బాలీవుడ్‌లో మిగతా దర్శక నిర్మాతలు, హీరోల దృష్టి తనవైపు పడేలా చూసుకోవాలన్నదే తమన్నా గేమ్ ప్లాన్ అట. దటీజ్ తమన్నా.