పరుశురామ్ కు ఓ సినిమా

పూరి స్కూల్ నుంచి వచ్చిన మంచి డైరక్టర్ పరుశురామ్. మంచి మాటల  రచయిత కూడా. చిన్న సినిమాలు చేసినపుడు బాగానే వున్నాడు. కానీ రవితేజ తో సారొచ్చారు అంటూ పెద్ద సినిమా చేసి దారుణంగా…

పూరి స్కూల్ నుంచి వచ్చిన మంచి డైరక్టర్ పరుశురామ్. మంచి మాటల  రచయిత కూడా. చిన్న సినిమాలు చేసినపుడు బాగానే వున్నాడు. కానీ రవితేజ తో సారొచ్చారు అంటూ పెద్ద సినిమా చేసి దారుణంగా దెబ్బతిన్నాడు. 

సినిమా ఓకె. కానీ మిస్ కాస్టింగ్ అన్నారు. అంతే అక్కడి నుంచి మళ్లీ సినిమా లేదు. ఆఖరికి ఇప్పుడు ఓ ఆఫర్ దక్కించుకున్నాడు. కొత్త జంట తరువాత సరైన సినిమా చేద్దామని చూస్తున అల్లు శిరీష్ తో ఓ సబ్జెక్ట్ ఓకె చేయించుకున్నాడని వినికిడి. 

అల్లు శిరీష్ ఇప్పటికే ఓ కొత్త దర్శకుడికి  కూడా మాటిచ్చాడు. మరి ఏది ముందు రెడీ అవుతుందో చూడాలి. శిరీష్ తో హిట్ కొట్టాడంటే పరుశురామ్ దశ తిరిగిపోతుంది. టాలెంట్ వున్నవాళ్లని మెగా క్యాంప్ అంత సులువుగా వదలదు.