అసలు ఏమిటీ క్వశ్చను అనుకోవద్దు. ఇద్దరూ తమ తమ కొడుకుల్ని హీరోల్ని చేసినవారే. ఇద్దరూ ఇండస్ట్రీలో అజాత శతృవుగా పేరు తెచ్చుకున్నవారే.
కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, బ్రహ్మానందం కుమారుడి సినిమా బసంతి వచ్చినపుడు, ఎంతమంద హీరోలు, సినిమా ప్రముఖులు తమ స్పందన ఎలా తెలియచేసారు..బైట్ లు ఇచ్చారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి..
మరి నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తెరంగ్రేటం చేసినపుడు కనీసం మెగా హీరోలయినా, పడిపోతున్న సినిమాను లేపే ప్రయత్నం ఎందుకు చేయలేదో? నాగబాబు అందరితో మంచిగా వుంటారు. ఎప్పుడు నవ్వుతూ వుంటారు. అభిమానులకు, మెగా హీరోలకు మధ్య వారథిగా వుంటారు. మరి అలాంటి వ్యక్తి కుమారుడి ఎంట్రీని అంత సాదా సీదాగా ఎందుకు వదిలేసినట్లో?