సుమ…ఎందుకిలా?

ఏంకర్ సుమ…పెద్ద పెద్ద కార్యక్రమాలకు కంపల్సరీ ఏంకర్…ఏదైనా మొహమాటం వుంటే ఝాన్సీ కూడా వస్తుందేమో కానీ, సుమ ప్లేస్ మాత్రం ఎవరూ రీప్లేస్ చేయరు. పైగా సుమ కూడా ఎలాంటి హీరో అయినా జంకు,…

ఏంకర్ సుమ…పెద్ద పెద్ద కార్యక్రమాలకు కంపల్సరీ ఏంకర్…ఏదైనా మొహమాటం వుంటే ఝాన్సీ కూడా వస్తుందేమో కానీ, సుమ ప్లేస్ మాత్రం ఎవరూ రీప్లేస్ చేయరు. పైగా సుమ కూడా ఎలాంటి హీరో అయినా జంకు, గొంకు లేకుండా మాట్లాడుతుంది. చకచకా అడగాల్సినవన్నీ అడిగేస్తుంది. అస్సలు మొహమాట పడదు..అడిగించుకున్న వాళ్లు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. 

కానీ నిన్న జరిగిన గోపాల గోపాల ఫంక్షన్ లో సుమ ఒక సమయంలో చాలా ఇబ్బందిగా వ్యవహరించినట్లు కనిపించింది. ముఖ్యంగా పవన్, వెంకటేష్ ను స్టేజ్ పైకి రప్పించినపుడు. వెంకటేష్ ను అడిగినంత చొరవగా, ఫ్రీగా పవన్ కు క్వశ్చన్ చేయలేకపోయినట్లు, సమాధానాలు రాబట్టలేకపోయినట్లు స్పష్టంగా తెలిసిపోయింది. ఆఖరికి ఒక దశలో తన వల్ల కాదనుకున్నారో ఏమో, త్రివిక్రమ్ పై భారం పెట్టారు. ఆయన నేనేం అడుగుతాను..అడిగేవాళ్లు వాళ్లు, చెప్పేవాడిని నేను అని తప్పించుకున్నారు. 

పైగా సుమ పవన్ ను క్వశ్నించేముందు పర్మిషన్ ఇస్తారా అనే అర్థం వచ్చేలా కాస్త బెరుకుగా అడగడం మరీ చిత్రం. నిజానికి సుమ అవతలి వారిని అడగకుండానే దూసుకుపోయే రకం. ఆమె కూడా తగ్గిపోవడం అంటే, అదే మరే ఏంకర్ అయినా నోట మాట వుండేది కాదేమో? కనీసం పవన్ అన్నా పరిస్థితి అర్థం చేసుకుని, సుమను ప్రశ్నించేందకు ప్రోత్సహించి వుండాల్సింది.