Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘పార్టీ’లో నీరసం ఏమిటీ?

‘పార్టీ’లో నీరసం ఏమిటీ?

కిర్రాక్ పార్టీ అంటే సూపర్ హుషారుగా వుంటుందనుకుంటారు అంతా. కానీ కిర్రాక్ పార్టీలో హీరో నిఖిల్ ఏమిటి? పాపం, నీరసంగా మొహం పెట్టుకుని, వాడిపోయిన గులాబి చేతిలో పట్టుకుని, వాల్ టైన్స్ డే పూటా దర్శనమిచ్చాడు. కిర్రాక్ పార్టీ వాలంటైన్స్ డే స్టిల్ అంటూ నిఖిల్ ఓ పిక్ ను వదిలాడు సినిమా ప్రమోషన్ లో భాగంగా. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథతో కూడిన సినిమా ఇది. అంటే ఇందులో భగ్న ప్రేమ కూడా వుందన్నమాట.

కాలేజీల్లో ఈ రోజుల్లో భగ్న ప్రేమ అంటే ఏముంటుంది? అబ్బాయి గారికి కారో, బైకో వుండకుండా వుండాలి. అమ్మాయి అవి వున్నవాడిని చూసుకుని జంప్ జిలానీ అయిపోతే పిల్లాడు ఇలా డిల్ల మొహం వేసాడని అనుకోవాలేమో?

నిఖిల్ కిర్రాక్ పార్టీ ఏప్రియల్ ఫస్ట్ లేదా సెకెండ్ వీక్ లో విడుదలవుతుంది. వాస్తవానికి ఫిబ్రవరిలో అనుకుని కాస్త హంగామా ముందుగా స్టార్ట్ చేసారు. కానీ ఎప్పడయితే హీరో నిఖిల్ పట్టుపట్టి ఏప్రియల్ కు వాయిదా వేయించాడో, ప్రచారానికి పాజ్ బటన్ నొక్కారు. మళ్లీ మార్చిలో మొదలెడతారు.

కిర్రాక్ పార్టీకి నిఖిల్ సన్నిహితులు చందు మొండేటి, సుధీర్ వర్మ చెరోపక్క మాటలు, స్క్రీన్ ప్లేతో సాయం పడుతున్నారు. చందు శిష్యుడు శరణ్ దర్శకత్వం వహిస్తునారు. అనిల్ సుంకర నిర్మాత.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?