పవన్‌కళ్యాణ్ మళ్లీ నటిస్తాడనే వార్తలు బాగా వినిపించిన ప్రతిసారీ వచ్చి తాను ఇక సినిమాలలో నటించేది లేదు అంటూ పవన్‌కళ్యాణ్ ప్రకటిస్తున్నాడు. అయితే అతను ఎంత గట్టిగా ఖండించినా కానీ మళ్లీ పవన్ నటిస్తాడనే వార్తలు పుడుతూనే వున్నాయి. ఇందుకు పవన్‌కళ్యాణే కారణమని చెప్పాలి. ఎందుకంటే పవన్‌కళ్యాణ్ ఇక నటించనని ప్రకటనలిస్తూ నిర్మాతలు, దర్శకులతో తరచుగా చర్చలు జరుపుతూనే వున్నాడు మరి.
పవన్‌కళ్యాణ్ మళ్లీ నటించాలి అని ఎవరైనా తన ముందు అంటే ముసి ముసి నవ్వులతో అందుకు సిద్ధమేనన్నట్టు సంకేతాలు ఇస్తున్నాడు. ఇటీవల రాజకీయ వ్యవహారాలలో కంటే సినిమా వేదికల మీదే ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇప్పటికీ పవన్‌కళ్యాణ్‌ని ఎక్కువగా కలుస్తోన్నది సినిమా వాళ్లే కావడం విశేషం. అసలు నటించే ఉద్దేశమే లేకపోతే ఏ దర్శకుడు వస్తానన్నా ఎంటర్‌టైన్ చేయడానికి పవన్‌కి ఏం పని?
ఎమ్మెల్యేగా కూడా నెగ్గకపోవడంతో రాజకీయపరంగా పవన్‌కి పెద్దగా పని లేదు. అందుకే సినిమాల పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. అదే సమయంలో పవన్‌కి రాజకీయాల పట్ల నిబద్ధత లేదని అంటారని జంకుతున్నట్టున్నాడు. ఒకవేళ నటించే ఉద్దేశం వుంటే నాన్చకుండా త్వరగా మొదలు పెట్టేస్తే కొన్నాళ్లు కామెంట్ చేసినా తర్వాత ఎవరూ పట్టించుకోరు.
అంతేకానీ ఇలా రెండు మైండ్స్‌లో చిక్కుకుని దేనికీ న్యాయం చేయకపోవడం న్యాయం కాదు.