Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్‌ కోసం బన్నీ ప్రచారం?

పవన్‌ కోసం బన్నీ ప్రచారం?

పవన్‌కళ్యాణ్‌ జనసేన ఈసారి పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధమయింది. మిగిలిన పార్టీల మాదిరిగా అనుభవం, స్థిరమైన క్యాడర్‌, నమ్మకం పెట్టుకోతగ్గ లీడర్స్‌, ఓట్‌ బ్యాంక్‌, అన్నిటికీ మించి ఆర్థిక బలం లేని జనసేనకి పవన్‌కళ్యాణ్‌కి వున్న జనాకర్షణ మాత్రమే అతి పెద్ద బలం. మెగా హీరోలంతా తలా ఒక చెయ్యి వేస్తే పవన్‌ పని సులువు అవుతుంది కానీ మెగా హీరోలెవరూ రాజకీయ రంగు పులుముకునే ఆలోచనలో లేనట్టున్నారు.

రామ్‌ చరణ్‌కి 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.'తోనే సరిపోతుంది. చిరంజీవి కూడా 'సైరా'తో మరి కొన్ని రోజులు బిజీగానే వుంటారు. అలాగే ఇతర హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ లాంటి వారు కూడా సోషల్‌ మీడియా సపోర్ట్‌ మినహా ప్రత్యక్ష ప్రచారానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే జనసేన తరఫున అల్లు అర్జున్‌ ప్రచారం చేయవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి.

అల్లుఅర్జున్‌ ఆప్త మిత్రుడు, గీతాఆర్ట్స్‌లో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోన్న 'బన్నీ' వాస్‌ ఈ ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేస్తాడని బలమైన సంకేతాలు అందుతున్నాయి. ఒకవేళ బన్నీ వాస్‌ బరిలోకి దిగితే అతని కోసం అల్లు అర్జున్‌ తప్పక ప్రచారానికి వస్తాడు. పవన్‌కళ్యాణ్‌కి, అల్లు కుటుంబానికి మొన్నీమధ్య వరకు విబేధాలు వున్నా కానీ అవన్నీ సమసిపోయి వారంతా ఒక్కటైపోయారు.

ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల వరకు మెగా ఫ్యామిలీ తరఫున పవన్‌కి బన్నీ తోడుగా నిలబడవచ్చు. 

ఓటు మాయం.. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?