పవన్ సినిమా దాసరి సీరియస్

పవన్ తో సినిమా నిర్మించే వ్యవహారంలో దర్శకుడు దాసరి చాలా సీరియస్ గానే వున్నారట. కథలు వింటున్నారు. సరైన కథ కోసం వెదుకులాడుతున్నారట. డాలీ, హరీష్ శంకర్, మరో దర్శకుడిని అనుకుంటున్నారట. వీరిలో ఎవరికి…

పవన్ తో సినిమా నిర్మించే వ్యవహారంలో దర్శకుడు దాసరి చాలా సీరియస్ గానే వున్నారట. కథలు వింటున్నారు. సరైన కథ కోసం వెదుకులాడుతున్నారట. డాలీ, హరీష్ శంకర్, మరో దర్శకుడిని అనుకుంటున్నారట. వీరిలో ఎవరికి పవన్ ఒకె అంటే వారితో సినిమా తెరకెక్కుతుంది. లేదూ పవన్ త్రివిక్రమ్ తో చేస్తా అన్నా కూడా దాసరికి ఓకెనట. 

అయితే డాలీకి పవన్ మాట ఇచ్చి వున్నాడు. హరీష్ అంటే అభిమానం వుంది. ఇక త్రివిక్రమ్ సంగతి చెప్పనక్కరే లేదు. మరి దాసరి ఏ కథ సెలెక్ట్ చేస్తాడో, పవన్ ఎవర్ని డైరక్టర్ గా సెలెక్ట్ చేస్తాడో. అయితే ఇక్కడో కండిషన్ వుంది. ముందు గబ్బర్ సింగ్ 2 పూర్తి కావలెను. అదే అనుమానం.