పవన్ కళ్యాణ్ నలభై రోజుల దీక్ష తీసుకున్నారా? అందుకే జుత్తు, గెడ్డం కట్ చేయకుండా అలా వదిలేసారా? నమ్మాలో వద్దో తెలియని ఈ గ్యాసిప్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అయితే నమ్మడానికి రెండు కారణాలు. ఒకటి ఆయన మరీ అకారణంగా అంత గడ్డం పెంచుతారా? దీనికి ఇంకో కారణం కూడా వినిపిస్తోంది.
గబ్బర్ సింగ్ లో ఓ ఎపిసోడ్ లో పవన్ ఇలా కనిపించాల్సి వుంటుందని. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇక మరో కారణం..త్రివిక్రమ్. దర్శకుడు త్రివిక్రమ్ అంటే పవన్ కు అత్యంత స్నేహం..గురి. అలాంటి త్రివిక్రమ్ కు ఓ గురువుగారు వున్నారు. ఆయన అంటే త్రివిక్రమ్ కు అపార నమ్మకం. వెస్ట్ గోదావరి ఐ.భీమవరం దగ్గరలోని ఓ ఆలయం వుందట. అక్కడ ఈ గురువుగారు, త్రివిక్రమ్ సినిమాలప్పుడు హోమాలు గట్రా చేస్తుంటారట.
అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల సమయంలో అక్కడ పూజలు హోమాలు చేసారు. వాటికి త్రివిక్రమ్, తన గురువుగారితో కలిసి హాజరయ్యారట. అయితే పవన్ వెళ్లారో లేదో తెలియదు. ఇప్పుడు ఆ గురువు సలహా మేరకే పవన్ ఈ దీక్ష పూనారని గ్యాసిప్ వినిపిస్తోంది. మరి దీక్షో, క్యారెక్టరో తెలియదు కానీ పవన్ కాస్తా, గెడ్డం బాబాగా దర్శనమిస్తున్నారు.