పవన్ ఫ్యాన్స్ కు మ్యూజికల్ గిఫ్ట్

పవన్ బర్త్ డే అంటే ఆయన ఫ్యాన్స్ కు పండగే. పైగా త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో సినిమా నిర్మాణంలో వుంది. అలాంటపుడు బర్త్ డే కు సమ్ థింగ్ స్పెషల్ వుంటుందని అనుకోవడంలో, ఆశించడంలో…

పవన్ బర్త్ డే అంటే ఆయన ఫ్యాన్స్ కు పండగే. పైగా త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో సినిమా నిర్మాణంలో వుంది. అలాంటపుడు బర్త్ డే కు సమ్ థింగ్ స్పెషల్ వుంటుందని అనుకోవడంలో, ఆశించడంలో తప్పు లేదు. పైగా వారం రోజుల నుంచి సోషల్ నెట్ వర్క్ లో ఇదే ఆసక్తికరమైన ట్రెడింగ్ న్యూస్. 

అయితే పవన్ బర్త్ డే కు అటు ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ ప్రకటన కానీ వుండకపోవచ్చని తెలుస్తోంది. లాస్ట్ మినిట్ లో త్రివిక్రమ్ అనుకుంటే తప్ప, అటువంటి ప్రకటన ఏదీ రాదు. కానీ అభిమానులు నిరాశ చెందకుండా, ఏదో సమ్ థింగ్ స్పెషల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా ఇది సినిమాలోని మ్యూజికల్ బిట్ లాంటిది అయి వుంటుదని తెలుస్తోంది. 

ఆ మాత్రం చాలు పవన్ అభిమానులు మురిసి, ఆనందించడానికి. పవన్ బర్త్ డే నాడు ఉదయం ఈ గిఫ్ట్ ను అందించే అవకాశం వుంది. పవన్-త్రివిక్రమ్ సినిమా జవవరి ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు ఇంకా రెండు నెలల షూట్ వర్క్ బకాయి వుంది. అందుకే ఇప్పటి నుంచి లుక్, టైటిల్ అంటూ హడావుడి ఎందుకుని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.