వెంకీకీ సరదా పుట్టింది

పూరిజగన్నాధ్ లాంటి వాళ్లు డిఫరెంట్ డైరక్టర్లు. వాళ్ల సినిమాలు ఎలా వున్నా, హీరోలు మాత్రం ఓ సినిమా అయినా వాళ్లతో చేయాలని అనుకుంటారు. ఇప్పుడు పైసా వసూల్ విషయంలో బాలయ్య స్టయిల్, మేకోవర్ చూసి,…

పూరిజగన్నాధ్ లాంటి వాళ్లు డిఫరెంట్ డైరక్టర్లు. వాళ్ల సినిమాలు ఎలా వున్నా, హీరోలు మాత్రం ఓ సినిమా అయినా వాళ్లతో చేయాలని అనుకుంటారు. ఇప్పుడు పైసా వసూల్ విషయంలో బాలయ్య స్టయిల్, మేకోవర్ చూసి, విక్టరీ వెంకటేష్ కు సరదా పుట్టిందని తెలుస్తోంది. ఓ సినిమా పూరితో చేస్తే ఎలా వుంటుందీ అని ఆలోచిస్తున్నాడట.

గతంలో పూరి ఒక సినిమా వెంకీతో చేయాలని అనుకున్నాడు. కానీ ఫుల్ స్క్రిప్ట్ లేక, సురేష్ క్యాంప్ లో అలాంటివి నడవక, ఆగిపోయింది. కానీ ఇప్పుడు సరైన స్క్రిప్ట్ తెస్తే, చేయడానికి సిద్దం అని వెంకటేష్ అప్పుడే పూరికి వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇది కూడా పైసా వసూల్ విజయం మీద ఆధారపడి వుండే అవకాశం వుంది. 

పైసా వసూల్ సినిమా ఎలా వున్నా కూడా వెంకీకి పూరితో సినిమా చేయాలని వుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని ఒకరిద్దరి దగ్గర వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్యను ఇలా మార్చిన పూరి ఈసారి ప్రాజెక్టు ఓకె అయితే వెంకీని ఎలా మారుస్తాడో?