ఎన్టీఆర్ లో నటుడే కాదు రచయిత, దర్ళకుడు ఇలా సినిమాలకు పనికొచ్చే చాలా కళలు వున్నాయి. ఇప్పుడు జై లవకుశ సినిమా విషయంలో ఈ కళలు అన్నీ పనికి వస్తున్నాయి అని తెలుస్తోంది. డైరక్టర్ బాబీ తీసిన కంటెంట్ తో సంతృప్తి చెందని ఎన్టీఆర్ తను దగ్గరుండి సినిమాను ఎడిట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
టోటల్ సినిమా చూసిన తరువాత ఎన్టీఆర్ కాస్త అసంతృప్తి ఫీల్ అయినట్లు, లూజ్ ఎండ్స్ వుంటే సరి చేసి, ఫస్ట్ హాఫ్ లాక్ చేసి, ఆర్ ఆర్ కు పంపించేసినట్లు తెలుస్తోంది. ఇప్పడు సెకండాఫ్ ను కూడా అదే విధంగా సెట్ చేసే పనిలో వున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఇది కూడా లాక్ అవుతుంది. సినిమాలో చివరి ఇరవై నిమషాల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం వుంటుందని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.
ఎన్టీఆర్ చేయి చేసుకున్న తరువాత టోటల్ ప్రొడక్ట్ పై కాన్ఫిడెన్స్ పెరిగిందని, సినిమా కళ్యాణ్ రామ్ బ్యానర్ కు, ఎన్టీఆర్ కు మంచి పేరు తెస్తుందని అంటున్నారు. ఇదిలా వుంటే సినిమాను 21న విడుదలకు ప్లాన్ చేసారు. కానీ సిజి పనుల పూర్తి కాలేదు. దీంతో పనులను ముక్కలు ముక్కలు గా చేసి, కొన్ని కంపెనీలకు ఇచ్చి, చకచకా పూర్తి చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
జైలవకుశ సినిమా వంద కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఓవర్ సీస్ మార్కెట్ లో తక్కువే కానీ, డొమెస్టిక్ మార్కెట్ లో (ఎపి తెలంగాణ) మహేష్ బాబు సినిమా కన్నా ఎక్కువ బిజినెస్ చేసారు. నిజానికి ఓవర్ సీస్ లో కూడా మంచి బిజినెస్ చేసేదే కానీ, డైరక్టర్ ఇమేజ్ సినిమాకు తోడు కాలేదు. మరే డైరక్టర్ అయినా ఓవర్ సీస్ బిజినెస్ వేరుగా వుండేది. సినిమాకు 55 నుంచి 60కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.