వాళ్ళంతా నపుంసకులే.. ఎందుకంట.?

'నేను మగాడ్ని..' అని చెప్పుకోవడంలో ఏముంది కిక్కు.? అనుకుంటున్నారు కొందరు.! 'నేను కొంచెం తేడా' అని చెప్పుకోవడం ఇప్పుడు క్రేజీ థింగ్‌ అయిపోయింది. తేడా బాబాల పుణ్యమా అని, ఈ 'తేడా' వ్యవహారాల చుట్టూ…

'నేను మగాడ్ని..' అని చెప్పుకోవడంలో ఏముంది కిక్కు.? అనుకుంటున్నారు కొందరు.! 'నేను కొంచెం తేడా' అని చెప్పుకోవడం ఇప్పుడు క్రేజీ థింగ్‌ అయిపోయింది. తేడా బాబాల పుణ్యమా అని, ఈ 'తేడా' వ్యవహారాల చుట్టూ పెద్ద రచ్చే జరుగుతోంది. గే, లెస్బియన్‌ వ్యవహారం వేరు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న 'తేడా' వ్యవహారం వేరు. ఈ తేడా, నిజంగానే పెద్ద తేడా.! 

కొన్నాళ్ళ క్రితం నిత్యానంద స్వామీజీ 'బాగోతం' వెలుగు చూసింది. ఒకప్పటి హీరోయిన్‌ రంజితతో కలిసి 'కామ కలాపాల్లో' మునిగి తేలుతూ రెడ్‌ హ్యాండెడ్‌గా వీడియోలకి చిక్కేశాడు నిత్యానంద. రంజిత మాత్రమే కాదు, ఎంతోమంది భక్తురాళ్ళని భక్తి పారవశ్యంలో ముంచెత్తేసి, వాళ్ళని తనకు 'దాసులుగా' మార్చేసుకోవడంలో నిత్యానంద రూటే సెపరేటు. నిత్యానంద ఆశ్రమంలో జరిగే అకృత్యాలు, అసాంఘీక కార్యకలాపాల గురించీ, అత్యాచారాల గురించీ ఆ తర్వాత చాలా 'వింతలే' వెలుగు చూశాయి. 

నిత్యానంద అరెస్ట్‌, విచారణ.. ఈ తంతు షరా మామూలే. అయితే, విచారణ సందర్బంగా 'నేను నపుంసకుడ్ని.. ఏ మహిళతో అయినా ఎలా శృంగారంలో పాల్గొనగలను.?' అంటూ ప్రశ్నించాడు నిత్యానంద. ఇంకేముంది, 'మగతనపు' పరీక్షలు షురూ అయ్యాయి. పరీక్షల్లో మనోడు 'స్ట్రాంగే' అని తేలినా, ఛత్‌.. ఆ ఛాన్సే లేదనేశాడు. 

చిత్రంగా 'మగతనం లేదు' అని చెప్పుకోవడానికి సర్టిఫికెట్లూ రెడీ చేసేసుకుంటున్నారు కొందరు. ఇదో రకం పైత్యం. మగతనం లేనోడు అత్యాచారమెలా చేస్తాడు.? అన్న లాజిక్‌ కింద న్యాయస్థానం, 'రేపిస్టుల్ని వదిలేస్తుంది' అనేది సోకాల్డ్‌ 'నపుంసకుల' ఆలోచన. తాజాగా, జైలుకెళ్ళిన 'డేరా' చీఫ్‌, గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌దీ అదే తీరు. సీబీఐ విచాణలో 'నేను నపుంసకుడ్ని' అనేశాడు. అందుకు తగ్గ ఆధారాల్నీ చూపించాడు. కానీ, సీబీఐ వదిలిపెట్టలేదు. ఫలితం ఇరవయ్యేళ్ళ జైలు శిక్ష. 

దేశంలో ఒక్కడే నిత్యానంద, ఒక్కడే డేరా బాబా.. వీళ్ళు తప్ప ఇంకెవరూ ఇలాంటోళ్ళు లేరనుకుంటే పొరపాటే. దేశంలో కుప్పలు తెప్పలుగా ఇలాంటోళ్ళున్నారు. వీళ్ళందరూ చాలామంది ప్రముఖులకి దేవుళ్ళు. రాజకీయ ప్రముఖులు, బాబాల చుట్టూ తిరుగుతుంటారు. ఆ బాబాల అకృత్యాల్లో పాలుపంచుకుంటుంటారు. క్రికెటర్లు, సినీ ప్రముఖులు, అధికారులు (పోలీస్‌ ఉన్నతాధికారులు కూడా) బాబాలకు వంగి వంగి దండాలు పెట్టడం చూస్తూనే వున్నాం. 

ఏళ్ళ తరబడి 'బాబా' ముసుగులో అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు, అరాచకాలు సృష్టించడం 'బాబా'లకు అలవాటైపోయింది. వందల్లో, వేలల్లో, లక్షల్లో బాబాలు తయారవుతోంటే, చట్టానికి చిక్కుతోన్నది ఒకరిద్దరు మాత్రమే.! దొరికినోళ్ళలో చాలామంది చెప్పుకునేది తాము నపుంసకులమనే. దేశంలో రాజకీయ నపుంసకత్వం నశిస్తే తప్ప, ఇలాంటి బాబాల ఆటకట్టే పరిస్థితి వుండదు. ఎనీ డౌట్స్‌.?