సాయిధరమ్ కు నచ్చలేదట

వివి వినాయక్ డైరక్షన్ లో హీరో సాయిధరమ్ తేజ సినిమా మొదలయింది. అసలే సాయిధరమ్ టైమ్ బాగా లేదు. సరైన సినిమా పడడం లేదు. బ్రేక్ రావడం లేదు. జవాన్ సినిమా బాగుంటుంది అనుకుంటే…

వివి వినాయక్ డైరక్షన్ లో హీరో సాయిధరమ్ తేజ సినిమా మొదలయింది. అసలే సాయిధరమ్ టైమ్ బాగా లేదు. సరైన సినిమా పడడం లేదు. బ్రేక్ రావడం లేదు. జవాన్ సినిమా బాగుంటుంది అనుకుంటే సరిగ్గా, రాక సినిమా బ్యాక్ బోన్ అయిన దిల్ రాజు దాన్ని పక్కన పెట్టారు. అది ఎప్పుడు రిపేర్లు పూర్తి చేసుకుంటుందో తెలియదు.

ఇదిలా వుంటే వివి వినాయక్ సినిమాకు కూడా సమస్యలు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కథకుడు మరెవరో కాదు. వివి వినాయక్ ఆస్థాన రచయిత ఆకుల శివే. కానీ ఆ కథ సెకండాఫ్ హీరో సాయి ధరమ్ కు అంతగా నచ్చలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో కొన్ని చేంజెస్ చెప్పాడట. ఆ మేరకు కథకు రిపేర్లు చేసే పనిలో ఆకుల శివ బిజీగా వున్నారని తెలుస్తోంది. 

అంటే ఈ సినిమా కూడా కాస్త టైమ్ పట్టేటట్లే వుంది. ఈ సినిమా ప్యాకేజ్ ప్రాతిపదికన వినాయక్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. మరి ప్యాకేజ్ వంతున అందించే సినిమాల క్వాలిటీ ఎలా వుంటుందో అన్నది మెగాభిమానులకు అనుమానంగా వుంది.