రెండు సినిమాలకు సితార శ్రీకారం

ప్రేమమ్, బాబు బంగారం అనే రెండు సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ. హారిక హాసిని అనుబంధం సంస్థ అయిన ఈ సంస్థ మళ్లీ ఒకేసారి రెండు సినిమాలకు శ్రీకారం…

ప్రేమమ్, బాబు బంగారం అనే రెండు సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ. హారిక హాసిని అనుబంధం సంస్థ అయిన ఈ సంస్థ మళ్లీ ఒకేసారి రెండు సినిమాలకు శ్రీకారం చుడుతోంది.

యంగ్ హీరో నాగ్ చైతన్య-యూత్ ఫుల్ సినిమాల డైరక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా, అలాగే థ్రిల్లర్లు తీసే సుధీర్ వర్మ, డిఫరెంట్ సినిమాలు అటెంప్ట్ చేసే హీరో శర్వానంద్ ల కాంబినేషన్ లో మరో సినిమా ఒకేసారి స్టార్ట్ చేస్తున్నారు.

హారిక హాసిని అధినేత సూర్య దేవర రాధాకృష్ణ (చినబాబు) బర్త్ డే (31న) సందర్భంగా ఈ సినిమాలను ప్రకటించారు. ముందుగా శర్వానంద్ సినిమా స్టార్ట్ చేస్తారు. దాని వెంటనే నాగ్ చైతన్య సినిమా వుంటుంది. ఈ రెండూ కాక మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు.

గతంలో అ..ఆ తో పాటుగా రెండు మీడియం సినిమాలు ప్లాన్ చేసి నిర్మించారు. ఇప్పుడు పవన్-త్రివిక్రమ్ సినిమా అవుతుండగా ఈ సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. కాస్త మంచి, మినిమమ్ గ్యారంటీ సినిమాల నిర్మాణ సంస్థగా హారిక హాసినికి, సితార ఎంటర్ టైన్మెంట్స్ కు ఇండస్ట్రీలో పేరుంది.