పవన్ ఫ్యాన్స్ కు పండగ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తోంది. ఇక ఫ్యాన్స్ కు ఓ మాదిరిగా వుండదు హుషారు. ఈ హుషారును మరింత పెంచేలా ఆయన బర్త్ డే సందర్భంగా పవన్ సినిమాల అప్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తోంది. ఇక ఫ్యాన్స్ కు ఓ మాదిరిగా వుండదు హుషారు. ఈ హుషారును మరింత పెంచేలా ఆయన బర్త్ డే సందర్భంగా పవన్ సినిమాల అప్ డేట్ లు చకచకా రానున్నాయి. పవన్ కమ్ బ్యాక్ సినిమా వకీల్ సాబ్ నుంచి మోషన్ పోస్టర్ రాబోతోంది. 

అలాగే ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న హరీష్ శంకర్-మైత్రీ మూవీస్ సినిమా నుంచి అప్ డేట్ రాబోతోంది. క్రిష్-ఎ ఎమ్ రత్నం సినిమా తరపున చిన్న విడియో బైట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. 

ఇవన్నీ ఒక్కసారి రావడం అంటే పవన్ ఫ్యాన్స్ కు పండగే. దీంతో పాటు ఇంకా మరో ఒకటి రెండు విశేషాలు బయటకు వచ్చినా రావచ్చు. మొత్తం మీద పవన్ బర్త్ డే హడావుడి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వుండే అవకాశం వుంది.

V కథను పవన్-మహేష్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేదు