శివం ప్రాజెక్టు నుంచి మహేష్‌బాబు ఎప్పుడో తప్పుకొన్నా… ఈమధ్యే అధికారికంగా క్రిష్‌కి ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆ కథకు సరితూగే కథానాయకుడి కోసం వెదుకుతున్నాడు క్రిష్. ఈ కథకు స్టార్ హీరోనే కావాలట. అందులోనూ మహేష్ స్థాయి ఉన్న హీరో.
అందుకే ఈ కథ పవన్ కల్యాణ్‌కి వినిపించే పనిలో ఉన్నాడు క్రిష్. 'మనమిద్దరం ఓ సినిమా చేద్దాం..' అని క్రిష్ కి ఇది వరకే పవన్ మాటిచ్చాడు. పవన్ ఆలోచనలకు తగినట్టు సామాజిక అంశాలు మేళవించిన కథను క్రిష్ తయారు చేశాడు కూడా. ఇప్పుడు ఆ కథ పక్కన పెట్టి, శివంలో మార్పులుచేయడానికి క్రిష్ కసరత్తులు ప్రారంభించేశాడు.
పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందింతే ఈ ప్రాజెక్టు టేకాఫ్ చేయడానికి పీవీపీ సంస్థ కూడా రెడీగా ఉంది. మరి ప్రిన్స్ వద్దన్న ప్రాజెక్టును పవన్ ఒప్పుకొంటాడా? లేదా? అనేదే పెద్ద ప్రశ్న. ఇది వరకు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం చిన్నోడి పాత్రకు ముందు పవన్నే అనుకొన్నారు. పవన్ నో చెప్పేసరికి అది మహేష్ కి చేరింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందన్నమాట.