Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పింక్ రీమేక్ కాదు, పొలిటికల్ మూవీనే..?

పింక్ రీమేక్ కాదు, పొలిటికల్ మూవీనే..?

పవన్ కల్యాణ్ కి మళ్లీ సినిమాల మీద మనసు పడింది. ఈసారి సినిమా వాళ్లతో కాకుండా తనకు అత్యంత సన్నిహితులైన రాజకీయ సలహాదారులతోనే సినిమా విషయం చర్చించారట పవన్ కల్యాణ్. తన రీఎంట్రీతో పాటు ప్రస్తుత రాజకీయాలపై సినిమా తీస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చించారట. పింక్ సినిమాని పాక్షికంగా పక్కనపెట్టేసి ఓ పొలిటికల్ మూవీ తీస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారట. 

ప్రస్తుతం రాష్ట్రంలో పాలన బాగోలేదని, దీన్ని ఆధారంగా కథ తయారు చేసుకుని, ప్రతిపక్ష నేతను హీరోగా చూపిస్తూ, చివరికి అతను రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకు సాగించిన పోరాటాన్ని హైలెట్ చేస్తూ సినిమా తీయాలనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉన్నట్టుంది.

ప్రస్తుతం పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా, వాటికి వస్తున్న స్పందన అంతంత మాత్రం. స్పందన కంటే ఎక్కువగా సెటైర్లు పడుతున్నాయి, వాస్తవానికి ఈ నిరసన కార్యక్రమాలతో పవన్ కల్యాణ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుందనే విషయం ఆయనకు మాత్రం తెలియడం లేదు. కానీ పవన్ మాత్రం తనకు అపూర్వ ప్రజాదరణ వస్తోందని, దీన్ని సినిమాగా మలిస్తే బాగుంటుందని, తన పొలిటికల్ మైలేజీ కూడా పెరుగుతుందని ఆలోచిస్తున్నారట.

ఈ మేరకు తన సన్నిహితుల దగ్గర సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు జనసేనాని. ఇది క్లిక్ అయితే ఇలాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే సరిగ్గా ఎన్నికల నాటికి మరో సినిమా తీసి, దాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకోవాలనేది పవన్ కల్యాణ్ ప్లాన్ లా కనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు తీసే సినిమా రిజల్ట్ తేడా కొడితే ఎన్నికలదాకా ఇక ఎలాంటి ప్రయోగాలు చేయరట. ఈ నిబంధన పెట్టుకునే పవన్ సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

రాజకీయంగా తనకు ముఖ్యులుగా ఉన్నవారి దగ్గర పవన్ ఈ విషయాలను ప్రస్తావించిన మాట వాస్తవం. దీనికి సదరు నేతలు బ్రహ్మాండమైన ఐడియా అని మెచ్చుకోవడం కూడా జరిగింది. ఇక సినిమా వర్గాలతోనే పవన్ ఈ సినిమా గురించి చర్చించాల్సి ఉంది. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ అభిమానులకు మాత్రం ఇది ఓ శుభవార్తే.

ఓవైపు పింక్ రీమేక్ పై జోరుగా చర్చ సాగుతున్న వేళ (ప్రీ-ప్రొడక్షన్ కూడా నడుస్తోందని టాక్) ఇలా పవన్ యూటర్న్ తీసుకోవడం, ఆ రీమేక్ కోసం కసరత్తు చేస్తున్న వాళ్లకు చేదు వార్తే. ఈ సంగతి అటుంచితే, సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనే విషయాన్ని పవన్ ఇంకా తెలుసుకోకపోవడమే దురదృష్టం. ఇలాంటి ఎన్ని సినిమాలు చేసినా ప్రజలు చప్పట్లు కొడతారే కానీ ఓట్లు మాత్రం వేయరనే విషయాన్ని జనసేనాని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?